అరసవల్లి/గార: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి సత్తి, జస్టిస్ గేదెల తుహీన్‌కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులంతా పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. న్యాయమూర్తులకు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, ఇప్పిలి సాందీప్‌శర్మ, ఇప్పిలి షణ్ముఖశర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మంలో జరిగిన కార్యక్రమంలో ఈఓ కోట నరసింహనాయుడు, అర్చకులు లక్ష్మణాచార్యులు, కిషోర్‌బాబు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల తనిఖీ
పాతపట్నం: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో శాతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయాధికారి వై.యశోదలక్ష్మి అన్నారు. పాతపట్నం మండలం ప్రహరాజపాలెంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఎయిమ్స్ వైద్యుడు మహమ్మద్ షాజాద్ మాట్లాడుతూ కౌమార దశలో వచ్చే శారీరక, మానసిక మార్పులు, వాటి ప్రభావం వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాత్‌రూమ్‌లో నాగుపాము
మెళియాపుట్టి : మండల కేంద్రం మెళియాపుట్టిలోని ఎగువవీధిలో ఈశ్వరరావు ఇంటి బాత్‌రూంలో శనివారం నాగుపాము కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ముందు భయపడినప్పటికీ నాగుల చవితి నాడు దర్శనమివ్వడంతో పాలు పెట్టి పూజలు చేశారు.
ఆదిత్యున్ని దర్శించుకున్న హైకోర్టు జడ్జిలు
ఆదిత్యున్ని దర్శించుకున్న హైకోర్టు జడ్జిలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
