 
															ఇన్ఫోసిస్‌కు 117 మంది ఎంపిక
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 117 మంది విద్యార్థులు సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలకు ఎంపికై నట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఓడీలు, అధ్యాపకుల కృషి, విద్యార్థుల శ్రమ కారణంగా మంచి ఉద్యోగాలు సాధిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ప్లేస్‌మెంట్ హెచ్‌ఓడీ ఎం.సంతోష్‌కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ హెచ్‌ఓడీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తల్లికి అంత్యక్రియలు చేసిన తనయ
సోంపేట: తల్లికి కుమార్తె అంత్యక్రియలు నిర్వహించిన ఘటన సోంపేట మండలం తోటవూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనేటి పార్వతి (46) అనారోగ్యంతో మృతి చెందింది. ఈమె భర్త భాస్కరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. కుమారుడు మానసిక రోగి. దీంతో కుమార్తె గౌరి పుట్టెడు దుఃఖంతోనే తల్లికి అంత్యక్రియలు పూర్తి చేసింది.
 
							ఇన్ఫోసిస్‌కు 117 మంది ఎంపిక

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
