
ఊరికి ఉపకారిగా..
సరుబుజ్జిలి : పుట్టిన ఊరు రుణం తీర్చుకునేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని, పురుషోత్తపురం పంచాయతీ, పీహెచ్‌సీ అభివృధ్ధికి తనవంతు కృషి చేస్తానని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం జిల్లా పార్లమెంటరీ పరిశీలకుడు కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ అన్నారు. తన సోదరుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కిల్లి విశ్వేశ్వరరావు జ్ఞాపకార్థం నిర్మించిన ‘కిల్లి వెంకట అప్పలనాయుడు పీహెచ్‌సీ’కి కుటుంబ సభ్యులు సమకూర్చిన రూ.2లక్షల విలువైన వైద్యారోగ్య మెటీరియల్‌ను శనివారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి రమాదేవి, సర్పంచ్ కిల్లి రాజ్యలక్ష్మి, ఉపసర్పంచ్ పైడి నర్శింహ అప్పారావు, పార్టీ నేతలు కిల్లి రామ్మోహనరావు, కిల్లి వెంకటేష్, కిల్లి వెంకటరమణ, ఆస్పత్రి వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
సేవలకు కేరాఫ్ అడ్రస్...
గత వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో తన తండ్రి కిల్లి వెంకటఅప్పలనాయుడు పేరిట మంజూరైన పీహెచ్‌సీని రూ.2కోట్ల 30 లక్షలతో నిర్మించారు. దీనికోసం రూ.కోటీ 50 లక్షల విలువైన 2 ఎకరాల సొంత స్థలాన్ని దానం చేశారు. ఆస్పత్రి ఆవరణలో రూ.5లక్షల సొంత నిధులతో వాటర్‌ప్లాంట్ నిర్మించి ప్రారంభానికి సిద్ధం చేశారు. తాజాగా వైద్య పరికరాలు, ఇతర సామగ్రి అందజేశారు.
పురుషోత్తపురం గ్రామానికి అడిగిన వెంటనే పీహెచ్‌సీ మంజూరు చేసిన గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడి ప్రజలకు ప్రాణదాతగా నిలిచారు. ప్రజా సంక్షేమం కోసం పార్టీ తరఫున అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
– కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ,
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పురుషోత్తపురం
స్వగ్రామం పురుషోత్తపురం అభివృద్ధికి కృషి చేస్తున్న కేవీజీ
ఇప్పటికే పీహెచ్‌సీకి భూదానం
తాజాగా రూ.2లక్షలతో వైద్యారోగ్య పరికరాల వితరణ

ఊరికి ఉపకారిగా..