
యూరియా కోసం పాట్లు
పలాస: పలాస మండలం టెక్కలిపట్నం గ్రామ సచివాలయం వద్ద రైతులు శనివారం యూరియా కోసం ఎగబడ్డారు. ఒక రైతుకు ఒకే బస్తా ఇస్తుండటంతో రైతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలాస ఎ.డి.ఎ రామారావును వివరణ కోరగా పలాస డివిజన్‌కు మొత్తం 19 టన్నుల యూరియా వచ్చిందని, సగానికి పైగా ఇప్పటికే అందజేశామన్నారు. ఒక ఎకరాకు అరబస్తా మాత్రమే ఇస్తున్నామని, రెండు దఫాలుగా ఒక బస్తా ఇస్తున్నామని ఇది ప్రభుత్వం నిబంధన అని చెప్పారు.
టెక్కలిపట్నం గ్రామ సచివాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు