శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Jul 13 2025 4:37 AM | Updated on Jul 13 2025 4:37 AM

శ్రీక

శ్రీకాకుళం

బ్యాడ్మింటన్‌ టోర్నీ ప్రారంభంజిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్‌ టోర్నీ ప్రారంభమైంది. 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. –8లో
నిద్దరోతోందా..?

ఉద్దానంలో విధ్వంసం వద్దు

కార్గో ఎయిర్‌పోర్టుపై ఉద్దానంలో నిరసన గళం వినిపిస్తోంది. ఉద్దానంలో విధ్వంసం వద్దంటున్నారు. 8లో

ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025

టీడీపీ హయాంలోనే ఫరీదుపేటలో హత్యలు

ఇప్పటివరకు జరిగిన నాలుగు హత్యలు

చంద్రబాబు పాలనలోనే

టీడీపీ అధికారంలోకి

వచ్చిన ప్రతిసారి

రెచ్చిపోతున్న రౌడీ మూకలు

సునాయాసంగా ప్రత్యర్థులను

హతమారుస్తున్న పరిస్థితి

పోలీసు పికెట్‌ ఉన్నా హత్య జరగడంతో మరింత అనుమానాలు

పోలీసులు ఉదాసీనతే హత్యకు కారణమని బాధిత కుటుంబీకుల ఆరోపణ

జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదివారం వెల్లడించారు. ప్రతి రైతు తమకు కావాల్సిన ఎరువులు తీసుకోవచ్చన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు ప్రభుత్వం 50% ప్రైవేటు వర్తకులు 50% సొసైటీలు లేదా రైతు సేవా కేంద్రాలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో యూరియా 10583 ఎంటీఎస్‌, డీఏపీ 6402 ఎంటీఎస్‌, పోటాష్‌ 922 ఎంటీఎస్‌, కాంప్లెక్స్‌ 3084 ఎంటీఎస్‌, సూపర్‌ పాస్పేట్‌ 842 ఎంటీఎస్‌ సరఫరా చేశామన్నారు. ఇందులో రైతు సేవా కేంద్రాలకు 50 శాతం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. జూలై 5 నాటికి జి.సిగడాం మండలంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వర కు యూరియా 239 ఎంటీఎస్‌, డీఏపీ 80.0 ఎంటీఎస్‌, మండల వ్యవసాయ అధికారి ప్రతిపాదనలు మేరకు మొత్తం 319.76 ఎంటీఎస్‌ సరఫరా చేశామని, ఈ వారంలో యూరియా 140.0 ఎంటీఎస్‌ సరఫరా చేయడానికి మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రతిపాదనలు చేశామని పేర్కొన్నారు. కావాల్సిన ఎరువుల విషయమై రాష్ట్ర కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించామని, జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని తెలియజేశారు.

గుడి చెంతనే మద్యం షాపు

నరసన్నపేట: మండలంలోని ఉర్లాంలో వేంకటేశ్వరాలయం, అంగన్‌వాడీ కేంద్రాల చెంతనే మద్యం షాపు పెట్టడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మరో చోటకు మార్చాలని కోరుతున్నారు. ఆలయానికి వంద మీటర్ల లోపునే మద్యం షాపు ఉందని స్థానికులు అంటున్నారు. అలాగే అక్కడే అంగన్‌వాడీ కేంద్రం ఉందని చెబుతున్నారు. ఎకై ్సజ్‌ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మరో చోటకు మద్యం షాపును మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఎకై ్సజ్‌ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.

కానిస్టేబుల్‌ నియామక పరీక్షలో భవానీకి రెండో ర్యాంకు

మందస: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్‌ నియామక పరీక్షలో మందస మండలం పిడిమందస గ్రామానికి చెందిన సేనాప తి భవాని రాష్ట్రస్థాయి మహిళల కేటగిరీలో రెండో ర్యాంకు సాధించింది. భవానీ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అభ్యసించారు. మహిళల విభాగంలో 154 మార్కులతో ఈ ర్యాంకు సాధించింది.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

చ్చెర్ల మండలంలోని ఫరీదుపేటపై చెరిగిపోని రక్తపు మరకలు పడుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఇక్కడ హత్యలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. హత్యలు జరిగాక సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌కు వచ్చి హడావుడి చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. గ్రామంలో జరిగిన నాలుగు హత్యలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినవే కావడం గమనార్హం. టార్గెట్‌ ప్రకారం ప్రత్యర్థులను కిరాతకంగా చంపేస్తున్నారు.

చంద్రన్న పాలనలో హత్యలు..

2001 జూన్‌ 21న చంద్రబా బు అధికారంలో ఉండగా వైస్‌ ఎంపీపీగా పనిచేసిన కోటిపాత్రుని పోలినాయు డు హత్యకు గురయ్యారు. దీనికి ప్రతీకార హత్య కూడా 2002 ఆగస్టులో జరిగింది. మొదలవలస రాంబాబును చంపేశారు. పార్టీల విషయం పక్కన పెడితే హత్యా రాజకీయాలకు ఫరీదుపేట వేదికై ంది. ఆ తర్వాత కొన్ని ఘటనలు జరిగినా హత్యల వరకు వెళ్లలేదు. మళ్లీ తాజాగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హత్యల పరంపర మొదలైంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో అంటే గత ఏడాది ఆగస్టులో వైఎస్సార్‌సీపీ కి చెందిన కూన ప్రసాద్‌ను టీడీపీ మూకలు హత్య చేశాయి. తాజాగా వైఎస్సార్‌సీపీకి చెందిన సత్తారు గోపిని మళ్లీ టీడీపీ వాళ్లే పట్ట పగలు దాడి చేసి చంపేశారు. ఈ హత్యలన్నీ దాదాపు టీడీపీ హయాంలోనే జరిగాయి.

నిఘా వైఫల్యమేనా..?

టీడీపీ పాలనలో నిఘా వైఫల్యమో? వ్యవస్థను పోలీసుల గుప్పెట్లో పెట్టుకోవడమో తెలీదు గాని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఫరీదుపేటలో హత్యలు జరుగుతున్నాయి. తాజాగా సత్తారు గోపి హత్యకు దారితీసే పరిస్థితులపైన ఆరోపణలు ఉన్నాయి. కూన ప్రసాద్‌ హత్య కేసులో తొమ్మిది మంది వరకు ఉన్నా నలుగుర్ని మాత్రమే నిందితు లుగా చూపించి, మిగతా వారికి యాంటిసిపేటరీ బెయిల్‌ వచ్చేలా పోలీసులు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని సత్తారు గోపి కుటుంబీకులే నేరుగా ఆరోపిస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందితులను విడిచిపెట్టడం వల్లే ఈ హత్య జరిగిందని, వారే గోపిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసు అధికారు లను సైతం మృతదేహం వద్దకు రాకుండా అడ్డుకు న్నారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. చివరి కీ ఎచ్చెర్ల ఎస్‌ఐ తీరుపై నేరుగా మండిపడ్డారు. తక్షణమే ఆయన్ని సస్పెండ్‌ చేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

పోలీసు పికెట్‌ ఉన్నా...

గత ఏడాది ఆగస్టులో కూన ప్రసాద్‌ హత్య తర్వాత ఫరీదుపేటలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతోనే పికెట్‌ పెట్టారు. అయినప్పటికీ మరో హత్య జరిగిందంటే ఏమనుకోవాలో తెలియని పరిస్థితి నెలకుంది. అసలు నిఘా వ్యవస్థ ఏమైంది? సమస్యాత్మక గ్రామంపై పర్యవేక్షణ కొరవడిందా? లేదంటే ఎవరైనా ప్రభావితం చేశారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మంత్రి లోకేష్‌

శ్రీకాకుళం క్రైమ్‌/ఎచ్చెర్ల : జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వైఎస్సార్‌ సీపీ కార్యకర్త సత్తారు గోపి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురికావడంతో ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దాదాపు 300 మందితో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటుచేశారు. శ్రీకాకుళం, కాశీబుగ్గ డీఎస్పీలు సీహెచ్‌ వివేకానంద, వీవీ అప్పారావులే కాక సీఐ లు, ఎస్‌ఐలు, ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచి, పోలీస్‌ కమాండోలు, ఏఆర్‌ సిబ్బందితో ఫరీదుపే ట ఇళ్ల గడపలు నిండిపోయాయి. దాదాపు ఊరి నుంచి జాతీయ రహదారి వరకు అడుగడుగునా పోలీసులు కనిపించారు.

12 మందిపై ఎఫ్‌ఐఆర్‌.. అదుపులో నలుగురు..?

మృతుడు గోపి కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మంది కీలక నిందితులను, మరో నలుగురు అనుమానితులను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని, ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఓ నిర్మానుష్య ప్రాంతంలో హత్య జర గడం, అక్కడ ఓ చెట్టుపై సీసీ కెమెరాలున్నా వారం రోజుల కిందటే పాడు చేయడం, హత్య జరిగిన రోజు అవి పనిచేయకపోవడం వంటివి అనుమానా లను బలపరుస్తున్నాయి. శనివారం ఉదయం రిమ్స్‌లో సత్తారు గోపి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి 11.30 గంటలకు గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసుల సమక్షంలోనే అంత్యక్రియలు జరిగాయి.

న్యూస్‌రీల్‌

రెడ్‌బుక్‌ రాజ్యాంగమే దీనికి కారణమా అన్న అనుమానాలు తలెత్తక మానలేదు. నిఘా వైఫల్యానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యంగా చెప్పవచ్చు. ప్రస్తుత ఎంపీపీ మొదలవలస చిరంజీవిని హతమార్చడానికి గత ప్రభుత్వం సమయంలో కొందరు ప్రయత్నిస్తే, నిఘా వ్యవస్థ పట్టిష్టంగా ఉండటంతో ఆ సమయంలో కుట్రదారులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడు నిఘా ఏమైందో పక్కన పెడితే పోలీసు పికెట్‌ ఉండి కూడా హత్య జరగడం విస్మయం కలిగిస్తోంది. శాంతిభద్రతలపై కాకుండా కక్షపూరిత రాజకీయాలపై దృష్టి పెట్టడం, పోలీసులను సైతం సక్రమంగా పనిచేయక పోనివ్వకపోవడం వల్లనే హత్యలకు అవకాశం ఏర్పడిందన్న వాదనలు ఉన్నాయి. కూన ప్రసాద్‌ హత్య జరిగినప్పుడే పోలీసు ఉన్నతాఽధికారులు కఠినంగా వ్యవహరిద్దామని భావించినా అధికారంలో ఉన్న పెద్దలు అడ్డు తగిలారు. దాని పర్యవసానమే తాజా హత్య అని ఆరోపణలు ఉన్నాయి.

శాంతియుతంగా ఉండాలి..

1951లో డబుల్‌ మర్డర్‌తో ఈ గ్రామంలో తగాదాలు ప్రారంభమయ్యాయి. గౌరీదేవి ఉత్సవాల్లో గొడవ వచ్చింది. మొదట్లో రెండు గ్రూపులు గ్రామానికి నాయకత్వం వహించేవారు. గ్రూపులుగా ఎప్పుడూ కొట్టుకోరు. అదను చూసి సింగిల్‌గా ప్రత్యర్థి వస్తే దాడికి ఎగబడతారు. గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలి.

– ఎం.అవతారం, సీఐ, జె.ఆర్‌.పురం

శ్రీకాకుళం1
1/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం3
3/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం4
4/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం5
5/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం6
6/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం7
7/8

శ్రీకాకుళం

శ్రీకాకుళం8
8/8

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement