
కాశీబుగ్గలో ఎస్పీ గ్రీవెన్స్
కాశీబుగ్గ:కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సివిల్, కుటుంబ కలహాలు, ఆస్తి, కొట్లాట, మిస్సింగ్, చీటింగ్ తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించారు.
శాకంబరిగా సంతోషిమాత
శ్రీకాకుళం కల్చరల్ : పాత శ్రీకాకుళంలో సంతోషిమాత అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మోదుకూరి కిరణ్‌శర్మ ఆధ్వర్యంలోఅమ్మవారికి వివిధ కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకున్నారు.
రోడ్డు తడుస్తోంది.. ఊరి గొంతు ఎండుతోంది!
ఇచ్ఛాపురం రూరల్: డొంకూరు గొంతు ఎండుతోంది. ఈ గ్రామస్తులకు అందిస్తున్న తాగునీరు రోడ్డు పాలు కావడంతో ఊరి వారు దాహం కేకలు పెడుతున్నారు. సుమారు నాలుగు వేల జనాభా ఉన్న ఈ గ్రామానికి ఉద్దానం తాగునీరు అందేది అంతంత మాత్రమే. అయితే స్థానిక వంతెన వద్ద పైప్ లీకేజీ కావడంతో మంచి నీరు వృధాగా పోతుండటంతో మహిళలు లీకేజీ నీటిని నింపుకునేందుకు ఆరాటపడుతున్నారు. నీరు లేక తమ గొంతెండుతుంటే, గత కొన్ని రోజులుగా పైప్ లీకేజీ అవుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణల తొలగింపు
జి.సిగడాం: జి.సిగడాం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆట మైదానంలో ఎట్టకేలకు ఆక్రమణలు తొలగించారు. తహసీల్దార్ మహాదేవు సరిత కృషితో ఎస్‌ఐ వై.మధుసూదనరావు నేతృత్వంలో గడ్డికుప్పలు, కర్రలు, వివిధ రకాల సామగ్రిని తొలగించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమి తమదంటూ ఆక్రమించారు. ఈ విషయమై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, సభ్యులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు అధికారులకు వినతిపత్రాలు అందించారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా సర్వే చేసి ఆటస్థలాన్ని కళాశాలకు అప్పగించారు. ఎట్టకేలకు సమస్య పరిష్కారం కావడంతో తహసీల్దార్‌ను పలువురు అభినందించారు.

కాశీబుగ్గలో ఎస్పీ గ్రీవెన్స్

కాశీబుగ్గలో ఎస్పీ గ్రీవెన్స్

కాశీబుగ్గలో ఎస్పీ గ్రీవెన్స్