
చంద్రబాబు మోసాలను ఎండగడదాం
●హామీలపై నిలదీయాలి..
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలపై కచ్చితంగా నిలదీయాలి. ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం కేసు లు పెడుతోంది. రైతులను కూడా అరాచక శక్తులుగా చూపిస్తోంది. వైఎస్ జగన్‌పై లేనిపోని ఆంక్షలు పెడుతోంది. 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్సార్ సీపీని తోలు తీస్తాం.. తాట తీస్తాం అంటే ఊరుకునేది లేదు.
– కుంభా రవిబాబు,
పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు
●ప్రశ్నిస్తే కేసులు, దాడులు
హామీలపై ప్రశ్నిస్తుంటే అన్యాయంగా కేసులు పెట్టి దాడులు చేస్తున్నా రు. చివరకు కూటమి నాయకుల కక్ష సాధింపు చర్యలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. జిల్లాలో నాగావళి, వంశధార నదుల్లో ఇసుక దోపిడీ జరుగుతోంది.
– తమ్మినేని సీతారాం, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త
●కార్యకర్తలే రారాజులు
రానున్న జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలే రారాజులు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా.. టీడీపీని ఎ ప్పుడు తరిమికొడదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 40 ఏళ్ల టీడీపీ పాలనలో సాధ్యం కానిది కేవలం ఒకే ఒక్క పర్యాయంలో వైఎస్ జగన్ చేసి చూపించారు.
– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి
టెక్కలి:
అధికారం కోసం సాధ్యం కాని హామీలు ఇవ్వడం, అధికారం దక్కాక మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సూపర్ సిక్స్ పేరుతో 143 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు ఏమీ అమలు చేయలేదని, ఆ మోసాలను గ్రామస్థాయి లో వివరించాలని ఆయన, పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ నర్తు రామారావు తదితరులు పిలుపునిచ్చారు. శని వారం టెక్కలిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బా బు ష్యూరిటీ...మోసం గ్యారెంటీ’ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయిలో సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలిచ్చినపుడు రాష్ట్ర ఆదాయం సరిచూసుకోలేదా అని ప్రశ్నించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో మూలపేట పోర్టు, ఉద్దానం ప్రాంతానికి సురక్షితమైన నీరు, కిడ్నీ స మస్యలకు ఆస్పత్రి రూపంలో పరిష్కారం చూపిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తురామారావు, పార్టీ కాళింగ కుల విభాగ రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, జెడ్పీటీసీలు దువ్వాడ వాణి, పాల వసంత్‌రెడ్డి, పేరాడ భార్గవి, దుబ్బ వెంకట్రావు, ఎంపీపీలు ఆట్ల సరోజనమ్మ, నడుపూరు శ్రీరామ్ముర్తి తదితరులు పాల్గొన్నారు.
పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
టెక్కలి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కూటమి పాలనపై ధ్వజమెత్తిన నేతలు

చంద్రబాబు మోసాలను ఎండగడదాం

చంద్రబాబు మోసాలను ఎండగడదాం

చంద్రబాబు మోసాలను ఎండగడదాం