
టీడీపీవన్నీ ప్రగతి వేషాలు
● ఈ ప్రాంత బాగుకోసం ఎందాకై నా పోరాటం చేస్తా ● శ్రీకాకుళం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం రూరల్:
వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను టీడీపీ దశాబ్దాలుగా మోసం చేస్తోందని, ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో శనివారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. చంద్రబాబునాయుడు ఏడాది పాలనలో కనీసం జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. అంతా కూటమి ప్రభుత్వం అంటున్నారు గానీ ఇది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడలేకపోతున్నారని, బీజేపీ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తోందని అన్నారు.
సోషల్ మీడియాను వాడుకుందాం..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి కార్యకర్తలే తీసుకెళ్లాలని, సోషల్ మీడియాను ఓ ఆయుధంలా వాడుకోవాలని సూచించారు. మన దాహార్తిని తీర్చి పంటలకు నీరిచ్చే వంశధార ప్రాజెక్టు పూర్తవ్వడానికి యా భై ఏళ్లు పట్టిందన్నారు. ఆఫ్‌షోర్, తోటపల్లి, నారాయణపురం వంటి ప్రధాన ప్రాజెక్టులకు నిధులు ఇచ్చింది దివంగత నేత వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. మన పాలకులకు ఈ ప్రాంతంపై పట్టింపు లేదు అనేందుకు అనే క ఉదాహరణలు ఉన్నాయన్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయబోనని, ప్రభుత్వ విధానాలపై మాత్రమే మాట్లాడతానని ధర్మాన అన్నారు. పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్‌కై నా, అసెంబ్లీకై నా పోటిచేస్తానని తెలిపారు. తన బదులుగా మరొ కరికి నాయకత్వం ఇస్తే వారికి మద్దతుగా ప్రోత్సహిస్తానన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదాం..
తాను పార్టీ మారతానని ఒకే ఏడాదిలో ఎన్నో పుకా ర్లు వచ్చాయన్నారు. కానీ అవన్నీ నిజం కావన్నారు. తన సైన్యాన్ని వదిలి వాళ్లతో మాట్లాడకుండా రా జకీయ రంగంలో యుద్ధం ఎలా చేయగలనంటూ ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి బాకాలు ఊదే పత్రికలను చదవద్దని, నిరాధార కథనాలను ప్రసారం చేసే చానెల్స్ చూడవద్దన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా సోషల్ మీడియా వేదికగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలన్నా రు. ప్రతి నియోజకవర్గంలో వేయిమందిని సోషల్ మీడియాలో భాగం చేస్తే ఎన్నికల నాటికి లక్షమందికి చేరువ అవుతారన్నారు. ఆ రోజు సచివాలయ వ్యవస్థను నిష్పక్షపాతంగా ఏర్పాటు చేశామని, ఈ రోజు బదిలీల పేరిట అధికార పార్టీ నేతలకు ముడుపులు ఇస్తేనే పని జరుగుతోందన్నారు. టీడీపీ గురించి వలంటీర్లను ఎన్నికల ముందే హెచ్చరించామని, ఇప్పుడు తాము చెప్పినట్టే జరుగుతోందన్నారు.
వైఎస్ జగన్ మరింత బలపడితే ఈ కూటమిలో ఉన్న నాయకులే రేపు మనతో కలిసి వస్తారన్నారు. మీరంతా కలిసి పనిచేసి గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. టీడీపీ మేనిఫెస్టో ఏమిటన్నది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలిసిపోతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన లక్ష్యమని తెలిపారు. సభాధ్యక్షుడు చిట్టి జనార్దనరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు ఎమ్మెల్సీ కుంభా రవిబా బు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ కళింగ వైశ్య, తూర్పు కాపు కుల విభాగాల రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి.స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.