
గోపి కుటుంబానికి అండగా ఉంటాం
● మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్
ఎచ్చెర్ల: ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఫరీదుపేట గ్రామంలో హత్యకు గురైన సత్తారు గోపి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో కలిసి ఆయన శనివారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ టీడీపీ నాయకులు గోపిని దారుణంగా హత్య చేశారని, ఇంతకు ముందు ఆయన కారు డ్రైవర్‌ను హత్య చేశారని, అప్పుడు ప్రధాన కారకులను కేసు నుంచి తప్పించారని అన్నారు. పో లీసు పికెటింగ్ ఉన్నా హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. గోపి కుటుంబానికి అండగా ఉంటామ న్నారు. భార్యాభర్తల తగువు మధ్యలో వ్యక్తిని హత్య చేయడం రాజకీయమని అన్నారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ దీనికి పూర్తిగా సహకరించారని ఆరోపించా రు. ఆయన సమక్షంలో భార్యాభర్తల గొడవకు సంబంధించి 41 నోటీసులు ఇవ్వడానికి 20 మంది పోలీసులు రావడం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడి విషయాలను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీ సుకెళ్లామని తెలిపారు. హత్యకు ప్రధాన కారకులు బయట కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. దీనిపై ఎస్పీ సమగ్ర దర్యాప్తును నిర్వహించి దోషులను వెంటనే శిక్షించాలని అన్నా రు. చనిపోయిన గోపి అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, బాబుకు కాలు విరిగిందని, పాప ఇంట ర్ చదువుతోందని, ఆ కుటుంబం వీధిన పడిందని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బోరసాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, జెడ్పీటీసీలు మీసాల సీతంనాయుడు, పిన్నింటి సాయికుమార్, నీలమప్పడు, శీరపు, శ్రీరామూర్తి, గోవిందరెడ్డి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.