
● ఇక్కడో పాక ఉండాలే..!
ఈ చిత్రంలో చదును చేసిన స్థలంలో మొన్నటి వరకు పాక ఉండేది. కొత్తూరు మండలం వసప గ్రామంలో ఈ నెల 5వ తేదీ రాత్రి ఇదేచోట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపిన శంకరరావు అనే వ్యక్తి మిన్నారావు అనే యువకుడిని హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతలో ఏం జరిగిందో గానీ గురువారం రాత్రి పూరిపాక కాలిపోయింది. ఆ ఆనవాళ్లు కూడా లేకుండా యంత్రాలతో చదును చేసేశారు. పోలీసు దర్యాప్తు దశలో ఉండగా పాకను ఎవరు కాల్చారు?ఎందుకు చదును చేశారనే విషయం తెలియడం లేదు. ఈ విషయమై దర్యాప్తు చేపట్టాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. – కొత్తూరు

● ఇక్కడో పాక ఉండాలే..!