
పర్యాటక స్థూపంగా పైలాన్
ఇచ్ఛాపురం రూరల్: ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన పైలాన్‌ను పర్యాటక స్థూపంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా 2017లో లొద్దపుట్టిలో విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం పైలాన్ శిథిలావస్థకు చేరుకోవడంతో శుక్రవారం ఎమ్మెల్సీ నర్తు రామారావు తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాదయాత్రకు చిహ్నంగా ఉండే పైలాన్‌ను ప్రతీ వైఎస్సార్‌సీపీ కార్యకర్త మదిలో చిరస్థాయిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కారంగి త్రినాథ్, ఆశి దాలయ్యరెడ్డి, పిలక సంతు, ఉప్పాడ రాజారెడ్డి, నైనా తేజా, తులసీ, తిప్పన ధనుంజయరెడ్డి పాల్గొన్నారు.