
● బడి కోసం రోడ్డెక్కిన కృష్ణాపురం
పురపాలక సంఘం పరిధిలోని రెండో వార్డు కృష్ణాపురం ప్రధాన రహదారి పక్కన ఉన్న మున్సిప ల్ ప్రైమరీ పాఠశాలను తరలించవద్దంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు శుక్రవారం రోడ్డెక్కా రు. శుక్రవారం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసన తెలుపుతూ ప్రైమరీ పాఠశాలను ఫౌండేషన్ స్కూల్‌గా మార్పు చేయవద్దంటూ అధికారులను వేడుకున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాఠశాలను తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటిౖకైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ విద్యా సంవత్సరానికి మున్సిపల్ ప్రైమరీ పాఠశాల గానే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
– ఆమదాలవలస