బ్లాక్‌ మెయిల్‌ దందా | - | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ మెయిల్‌ దందా

Jul 8 2025 4:33 AM | Updated on Jul 8 2025 4:33 AM

బ్లాక

బ్లాక్‌ మెయిల్‌ దందా

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జిల్లా కేంద్రంలో ఒక రౌడీ షీటర్‌కు ఎమ్మెల్యే, మరో టీడీపీ నాయకుడు అండగా ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. రూరల్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్టు కాకుండా 41 నోటీసు ఇచ్చి వదిలేసేలా ఎమ్మెల్యే సహకరించారు. ఫోన్‌లోనే తతంగమంతా నడిపారు. అటు రౌడీషీటర్‌ను హోల్డ్‌లో పెట్టి ఎమ్మెల్యే పోలీసులతో మాట్లాడారు. తన మని షి అని, ఎలాగైనా ఆయన్ని అరెస్టు చేయకుండా చూడాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అవసరమైతే డీఎస్పీతో కూడా మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా ఫోన్‌లో రికార్డు అయింది. రౌడీ షీటర్‌తో ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు, మరో కానిస్టేబుల్‌ మాట్లాడిన మాటలు ఆడియో క్లిప్పింగ్‌ ద్వా రా బయటకు వచ్చాయి. ఇప్పుడా ఆడియో క్లిప్పింగ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కేసు ఇది..

రాగోలు జెమ్స్‌లో పనిచేస్తున్న వెంకటేష్‌ పై అక్కడే పని చేస్తున్న ఓ మహిళ తనను ప్రేమించి, శారీరకంగా వాడుకుని పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో నగరంలో పీఎన్‌ కాలనీ సమీపంలో ఉంటున్న రౌడీషీట్‌ ఉన్న పైల చంద్రశేఖర్‌ అలియాస్‌ కుంగ్‌ఫు శేఖర్‌ జోక్యం చేసుకుని ఆ యువకుడిని, అతడి తండ్రి గోవిందరావును పిలిచి వార్నింగ్‌ ఇచ్చారు. రూ.లక్షా 50వేలు ఇవ్వాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టి బుక్‌ చేయిస్తానని బెదిరించాడు. అందుకు ఆ యువకుడు, తండ్రి అంగీకరించలేదు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మరోసారి కుంగ్‌ ఫు శేఖర్‌ ఫోన్‌ చేసి బెదిరించాడు. వ్యవహారం సీరియస్‌గా ఉందని, తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని భయపెట్టాడు. చేసేది లేక వెంకటేష్‌, అతని తల్లి, మరో దగ్గరి బంధువు వచ్చి కుంగ్‌ ఫు శేఖర్‌కు రూ.లక్షా 50వేలు ఇచ్చారు. కుంగ్‌ ఫు శేఖర్‌తో పాటు వచ్చిన బొట్ట శంకర్‌ అనే మరో రౌడీషీటర్‌ కూడా రూ. 20వేలు అడిగితే ఇచ్చారు. అంతా తీసుకున్నాక కూడా మళ్లీ మరికొంత సొమ్ము కావాలని ఫోన్‌లో డిమాండ్‌ చేశారు. బెదిరింపులకు సైతం దిగారు. దీన్ని తట్టుకోలేక యువకుడు వెంకటేష్‌ తండ్రి గోవిందరావు శ్రీకాకుళం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 308(2), 3(5) బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కుంగ్‌ ఫు శేఖర్‌, బొట్ట శంకర్‌పైన గత నెల 16న కేసు కూడా నమోదైంది. ఈ కేసులో ఎక్కడ తనను అరెస్టు చేస్తారనే భయంతో ఎలాగైనా అరెస్టు కాకుండా 41నోటీసుతో బయటపడాలని ఒక ఎమ్మెల్యేతోను, ఒక టీడీపీ నాయకుడు వాసుతోను, ఒక కానిస్టేబుల్‌తోను కుంగ్‌ ఫు శేఖర్‌ తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. ఆ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వాసు కూడా సహకరించారు. స్టేషన్‌ అధికారులతో మాట్లాడి, అరెస్టు లేకుండా 41నోటీసుతో వదిలేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఒక రౌడీషీటర్‌కు ఎమ్మెల్యే అండగా ఉండటమేంటి? ఆయన సన్నిహితుడిగా చెప్పుకునే వాసు కూడా సహకరించడమేంటని? పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగా వ్యవహరించడమేంటని చర్చనీయాంశమైంది.

తండ్రీ కొడుకులను డబ్బులు కోసం

బెదిరించిన కేసులో రౌడీషీటర్‌పై కేసు నమోదు

అరెస్టు కాకుండా 41 నోటీసుతో వదిలేసేలా చూడాలని ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడిని ఆశ్రయించిన రౌడీ షీటర్‌

41 నోటీసు ఇచ్చి వదిలేయాలని

పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశం

ఇవన్నీ రికార్డు చేసిన రౌడీషీటర్‌

కుంగు ఫు శేఖర్‌

బయటకు వచ్చిన ఆడియో క్లిప్పింగ్‌

బ్లాక్‌ మెయిల్‌ దందా1
1/1

బ్లాక్‌ మెయిల్‌ దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement