
అందుబాటులోకి సీఎన్‌జీ సేవలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: కంప్రెస్టు నేచర్ గ్యాస్ (సీఎన్‌జి)ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో నిర్వహిస్తున్న పౌర సరఫరాల సంస్థ పెట్రోల్ బంకులో సీఎన్‌జీ స్టేషన్‌ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎన్‌జీ వల్ల కాలుష్యం తగ్గుతుందన్నారు. కిలో రూ.91కే లభిస్తుందన్నారు. బంకు వద్ద 450 కేజీల నిల్వ ఉంటుందని వివరించారు. టెక్కలి వద్ద సైతం సీఎన్‌జీ ఏర్పాటు చేయాలని ఇండియన్ ఆయిల్ కంపెనీ యాజమాన్యానికి మంత్రి కోరారు. ఇప్పటికే అనుమతులు తీసుకున్నట్లు ఆర్డీఓ కష్ణమూర్తి చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ట్రైనీ కలెక్టర్ పథ్వీరాజ్ కుమార్, రీజనల్ హెడ్ డి.సుధాకరరావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.