బాబును బతికించండి | - | Sakshi
Sakshi News home page

బాబును బతికించండి

Jul 1 2025 3:51 AM | Updated on Jul 1 2025 3:51 AM

బాబున

బాబును బతికించండి

ఇచ్ఛాపురం రూరల్‌: ఆ బాబు వయసు పది నెలలు. నవ్వితే నిండు చందమామలా ముద్దుగా ఉంటాడు. తండ్రి పెయింటింగ్‌ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉన్నట్టుండి ఈ బాలుడికి అనారోగ్యం చేసింది. చూస్తుండగానే అది ప్రాణాంతకంగా మారిపోయింది. ఇప్పుడు బాబు బతకాలంటే రూ.20 లక్షలు ఖర్చు పెట్టి శస్త్ర చికిత్స చేయించాలి. పెయింటింగ్‌ పనికి వెళ్తే గానీ కుటుంబం కడుపు నిండని పరిస్థితుల్లో అంత డబ్బు తీసుకురావడం ఆ తల్లిదండ్రులకు తలకుమించిన భారమవుతోంది. బాబును బతికించుకోవడానికి వారు దాతల సాయం కోరుతున్నారు.

ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ గ్రా మానికి చెందిన మజ్జి పురుషోత్తం, శాంతిలకు ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండో సంతానం రియా న్‌. మూడు నెలలు కిందట బాబుకు హై ఫీవర్‌ రావడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించారు. బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో పాటు ఫిట్స్‌ రావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ పట్నంలో చేర్పించారు. 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన వైద్యులు పసివాడి మెదడులో ద్రవం చేరడంతో ‘హైడ్రో సెఫెలెస్‌ ఇన్‌ఫెక్షన్‌’కు గురయ్యాడని, శస్త్ర చికిత్స చేయాలంటూ చెప్పడంతో ఆరోగ్యశ్రీ ద్వా రా తొలిసారి ఆపరేషన్‌ చేశారు. అప్పటికే లక్ష రూ పాయల వరకు ఖర్చయింది. రెండు నెలలు తర్వా త బాబు తల రోజురోజుకూ పెరగడంతో మళ్లీ విశాఖ ఆస్పత్రిలో చేర్పించగా వెంటనే తిరుపతి స్విమ్స్‌కు లేదా హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలంటూ వైద్యులు సూచించారు. తిరుపతిలో పరీక్షించిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని, అందుకు సుమారు రూ.20 లక్షలు వరకు ఖర్చవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే ఎస్‌జీఎఫ్‌ సంస్థ, కాళీమాత సేవా సమితి, పూర్వ విద్యార్థులు కలసి రూ.50వేలు వరకు ఆర్థిక సాయం అందించడంతో తిరుపతి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సా యం చేయదలచుకున్న వారు 6304051247 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.

కన్నపేగు కోసం తల్లిదండ్రుల అభ్యర్థన

హైడ్రో సెఫెలెస్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న చిన్నారి

శస్త్ర చికిత్సకు రూ.20లక్షలు అవసరమవుతున్న వైనం

దాతల సాయం కోరుతున్న తల్లిదండ్రులు

బాబును బతికించండి 1
1/1

బాబును బతికించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement