
సదరం సర్టిఫికెట్ల వ్యవహారంపై సీఐ ఆరా
నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఆర్థో స్పెషలిస్టుగా పనిచేసిన రవికిరణ్ జారీ చేసిన సద రం సర్టిఫికెట్లపై నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు తన కార్యాలయంలో ఆరా తీశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన శ్రీకాకుళంలో గతంలో డీసీహెచ్‌గా పనిచేసి ప్రస్తుతం రాజాం సివిల్ సర్జన్ స్పెషలిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మితో సోమవారం మాట్లాడి వివరాలు సేకరించారు. నరసన్నపేట ఏరి యా ఆస్పత్రిలో పలువురు అనర్హులకు వికలాంగత్వం ఉందని రవికిరణ్ సర్టిఫై చేయడం, దానికి ఆస్పత్రి కమిటీ సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం తెలిసిందే. ఈ సర్టిఫికెట్లపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లడం, ఆయన పరిశీలనకు ఆదేశించడం, అవి అక్ర మమని నిర్ధారణ కావడం విధితమే. దీనిపై ఆర్థో స్పెషలిస్టు రవికిరణ్‌తో పాటు కమిటీలో ఉన్న వైద్యులకు వైద్య శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 30న నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశా రు. దీనికి సంబంధించి గతంలో డీసీహెచ్‌గా పనిచేసిన రాజ్యలక్ష్మి నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. ఎంత మంది అనర్హులకు సర్టిఫికెట్లు ఇచ్చారో అడిగి తెలుసుకున్నారు. సీఐ మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో ఉందని మరిన్ని వివరాల కోసం రాజ్యలక్ష్మితో మాట్లాడామని అన్నారు.