
ఆమరణ దీక్ష చేస్తా: టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి
టెక్కలి మండలంతో పాటు చాలా చోట్ల సర్పంచ్‌లు ఎలాంటి తప్పులు చేయకపోయినా అధికారులు చెక్‌పవర్ రద్దు చేస్తున్నారని..ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలిగిస్తున్నారని టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోవద్దని.. మళ్లీ జగనన్న ప్రభుత్వం వస్తుందని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. టెక్కలి మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్యం, మౌలిక వసతుల నిర్వహణ తీరు దారుణంగా ఉందని, ఈ నిర్లక్ష్యం వీడేంతవరకు టెక్కలిలో ఆమరణ దీక్ష చేపడతానని ప్రకటించారు. పంచాయతీ, మండల పరిషత్ నిధులను ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించాలన్నారు. టెక్కలిలో 196 హుదూద్ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కల్పించాలని కోరారు.