
బ్యారేజీ నిర్వహణలో అశ్రద్ధ వద్దు
హిరమండలం: గొట్టా బ్యారేజీ నిర్వహణ విషయంలో అశ్రద్ధ వద్దని వంశధార ప్రాజెక్టు నరసన్నపేట ఈఈ ఎంఏ సీతారామనాయుడు అన్నా రు. శుక్రవారం గొట్టా బ్యారేజీతో పాటు ఎడమ ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటరీని పరిశీలించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి నదిలో నీరు బ్యారేజీలో చేరుతున్నందున నీటిని స్థిరీకరించాలన్నారు. ఖరీఫ్‌నకు ఎలాంటి నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గొట్టా బ్యారేజీ కంట్రోల్ రూమ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. డీఈ సరస్వతి, ఏఈ ధనుంజయరావు, పరిశుద్ధబాబు, భాను తదితరులు పాల్గొన్నారు.