
లారీ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
కంచిలి: మండలంలోని అంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కంచిలి మండలం కర్తలి గ్రామానికి చెందిన మూలి సింహాచలం కత్తివరంలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సైకిల్‌పై వస్తుండగా ఫ్లై ఓవర్ డౌన్‌లో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడ్ని అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. యువకుడి పరిస్థితి విషమించడంతో బరంపురం ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ పి.అప్పిరెడ్డి తెలిపారు.