ట్రిపుల్‌ ఐటీ పరిపాలనాధికారికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ పరిపాలనాధికారికి డాక్టరేట్‌

Jun 27 2025 6:35 AM | Updated on Jun 27 2025 6:35 AM

ట్రిప

ట్రిపుల్‌ ఐటీ పరిపాలనాధికారికి డాక్టరేట్‌

ఎచ్చెర్ల: రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ) శ్రీకాకుళం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పరిపాలనాధికారి ముని రామకృష్ణ ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతి నుంచి డాక్టరేట్‌ పట్టా (పీహెచ్‌డీ)ను పొందారు. భాగస్వామ్య ఆధారిత సామాజిక అభ్యాసం, మార్కెట్లలో ధరల విధానాలు అనే అంశంపై డాక్టర్‌ కె.పి.నవీన్‌ పర్యవేక్షణలో పరిశోధన పూర్తిచేయడంతో డాక్టరేట్‌ లభించింది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సండ్ర అమరేంద్రకుమార్‌, డైరెక్టర్‌ ప్రొపెసర్‌ కె.వి.డి.జి.బాలాజీ, అకడమిక్‌ డీన్‌ శివరామకృష్ణ, ఫైనాన్స్‌ అధికారి వాసు, మోహనకృష్ణచౌదరి, డీన్‌ వెల్ఫేర్‌ రవి, డిప్యూటీ ఏవో డాక్టర్‌ గణేష్‌ మళ్ల తదితరులు రామకృష్ణను గురువారం అభినందించారు.

ఇంజినీరింగ్‌ కార్మికులకు

బీసీ నేతల మద్దతు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మున్సిపల్‌ ఇంజనీ రింగ్‌ వర్కర్లు తమ నైపుణ్యతతో నగరవాసుల కు తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు అందిస్తున్నా వారి సమస్యలను ప్రభు త్వం పట్టించుకోకపోవడం తగదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గద్దిబో యిన కృష్ణయాదవ్‌ అన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 43 రోజులుగా నిరసన తెలియజేస్తున్నా సర్కారు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి అలపాన త్రినాథరెడ్డి, కర్రి రంగాజీదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

పీజీసెట్‌లో అదరగొట్టిన

చెస్‌ చాంపియన్‌

శ్రీకాకుళం న్యూకాలనీ: చెస్‌ క్రీడలో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో అనేక పతకాలతో విజయబావుటా ఎగురవేసిన లక్ష్మీ గాయత్రి పీజీ ప్రవేశాలకుగాను నిర్వహించిన ఏపీ పీజీసెట్‌–2025 ఫలితాల్లో సత్తాచాటింది. హిస్టరీ సబ్జెక్టులో 100 మార్కుకుగాను 94 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు సాధించింది. ఆమదాలవలసలోని మెట్టక్కివలస వీరి నివాసం. తండ్రి చింతాడ ప్రేమ్‌కుమార్‌ ప్రభుత్వ ఉపాధ్యాయు డు, తల్లి సత్యవతి గృహిణి.

ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలు

మెళియాపుట్టి: వసుంధర గ్రామంలో ఆటో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఎస్సై రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశాకు చెందిన బొమ్మాళి కేశవరావు, వసుంధర గ్రామానికి చెందిన కుంతీపాత్రో వసుంధర గ్రామ రహదారి వద్ద నడిచి వెళుతుండగా ఒడిశా రాష్ట్రం బి.సీతాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ కె.గణపతి అతివేగంగా వచ్చి అదుపు తప్పి ఢీకొన్నాడు. ఈ ఘటనలో మహిళ తలకు తీవ్రగాయం కావడంతో శ్రీకాకు ళం తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే ప్రమాదంలో గాయపడిన కేశవరావును టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఆటో అదుపు తప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. కేశవరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రిపుల్‌ ఐటీ పరిపాలనాధికారికి డాక్టరేట్‌   1
1/2

ట్రిపుల్‌ ఐటీ పరిపాలనాధికారికి డాక్టరేట్‌

ట్రిపుల్‌ ఐటీ పరిపాలనాధికారికి డాక్టరేట్‌   2
2/2

ట్రిపుల్‌ ఐటీ పరిపాలనాధికారికి డాక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement