
క్రీడా పోటీలతో మానసికోల్లాసం
శ్రీకాకుళం రూరల్: శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని కేంద్రీయ విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.లవకుమార్ అన్నారు. పీఎం కేంద్రీయ విద్యాలయంలో హైదరాబాద్ రీజియన్ క్రికెట్ టోర్నమెంట్ అండర్–14 బాలురు పోటీలు గురువారం నిర్వహించారు. ఏడు జట్లకు చెందిన 101 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గుంట తులసీరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులూ ఆలోచన చేయాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు, పతకాలు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో పీఈటీ కె.సుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.