
ఉద్దాన ధ్వంస రచనకు నిరసనగా..
● ఉద్యాన యూనివర్సిటీ బోర్డు సభ్యత్వానికి బత్తిని లక్ష్మణ్ రాజీనామా
మందస: పచ్చని ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యా న యూనివర్సిటీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బత్తిని లక్ష్మణ్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడు తూ తిత్లీ తుఫాన్‌తో నష్టపోయిన రైతులను జగన న్న ఆదుకున్నారని, అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన తనను ఉద్యాన యూనివర్సిటీ బోర్డు మెంబర్‌గా నియమించారని చెప్పారు. కూట మి ప్రభుత్వం వచ్చాక రైతుల ఆమోదం లేకుండా ఉద్దానంలో 1394 ఎకరాల భూమిని స్వాధినం చేసుకొని 16 గ్రామాల ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం నచ్చలేదన్నారు. ఉద్దాన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పదవికి రాజీనా మా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై రైతులతో కలి సి ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. సమావేశంలో దున్న హరికృష్ణ, బెలమర జీవన్, మర్ల సంతోష్, పిచ్చు కిరణ్ తదితరులు పాల్గొనారు.