
దారుణాలు చూడండి..!
కలివరం వద్ద బస్సు ఎలా వెళ్లాల్సి వస్తుందో చూశారా. ఇసుక లారీల ధాటికి రోడ్డు గోతుల మయం కావడంతో బస్సు ఇలా పూర్తిగా ఒకవైపు వంగితే గానీ ముందుకు వెళ్లని ప్రమాదకర పరిస్థితి నెలకొంది.
ఆమదాలవలస రూరల్:
ఆమదాలవలస నియోజకవర్గంలోని పలు దారులు దారుణాలకు ఆనవాళ్లుగా కనిపిస్తున్నాయి. జాతీయ రహదారికి ఆనుకొని బూర్జ మండలం నారాయణపురం వరకు నాగావళి నదీతీరం పొడవునా సుమారు 30 వరకు అనధికార ఇసుక ర్యాంపు లు కొనసాగుతున్నాయి. నిత్యం వందల కొద్దీ లారీ లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నా రు. రాత్రి, పగలు తేడా లేకుండా వాహనాలు తిరుగుతుండడంతో ఈ పల్లె దారులు తట్టుకోలేకపోతు న్నాయి. ఎక్కడికక్కడ గోతులు ఏర్పడటమే కాకుండా రహదారి పొడవునా బీటలు వారడంతో దారుల రూపురేఖలే మారిపోయాయి. దూసి నుంచి బూర్జ మండలం నారాయణపురం వరకు ఇదే పరిస్థితి.
నిబంధనలకు మించి లోడింగ్
అక్రమ ఇసుక దందా దందాలో లారీ యజమానులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. రవాణా శాఖ నిబంధనలు మేరకు ఒక్కో లారీలో 20 నుంచి 25 టన్నులకు మించి లోడింగ్ చేయరాదు. కానీ ఇక్కడ ఒక్కో లారీకి పరిమితికి మించి ఇసుక లోడింగ్ చేయటంతో రహదారులు ధ్వంసమై అధ్వానంగా మారుతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన రవాణా శాఖ అధికారులు, పోలీసులు వీరివైపు కన్నెత్తి చూడడం లేదు.
బిక్కు బిక్కు మంటూ ప్రయాణాలు
బూర్జ మండలం గుత్తావల్లి నుంచి ఆమదాలవలస మండలం కొత్తవలస, దూసి మీదుగా శ్రీకాకుళం మండలం రాగోలు మీదుగా శ్రీకాకుళం పట్టణానికి ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులతో పాటు సుమారు 60 ఆటోలపై ప్రజలు తమ ప్రయాణం సాగిస్తుంటారు. రహదారి అధ్వానంగా ఉండడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు.
ప్రజలతో పనిలేదు
రహదారులు ఏమైనా తమకు సంబంధం లేదన్నట్లు కూటమి నాయకులు వ్యవహరిస్తుండడం విస్మయ పరుస్తోంది. రహదారులు పూర్తిగా పాడైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నా నాయకులు, అధికారులు ఎవరూ స్పందించడం లేదు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇసుక అక్రమ రవాణాతో రూపురేఖలు కోల్పోతున్న రహదారులు
బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్న ప్రజలు
పట్టించుకోని పాలకులు
పీరుసాహెబ్‌వానిపేట వద్ద రోడ్డు చూశారా. ఇసుక వాహనాలు తొక్కీ తొక్కీ రోడ్డును ఇలా గుల్ల చేసి పారేశాయి. ఈ దారి గుండా వాహనాలు ప్రయాణించాలంటే ఎంత కష్టం.
ఆమదాలవలస మండలం తొగరాం, కలివరం గ్రామాలను కలిపే రహదారి ఇది. చూసేందుకు మట్టి కుప్పలా మారిపోయింది. రాత్రి, పగలు లేకుండా ఇసుక వాహనాలు తిరుగుతుండడంతో దారికి ఈ పరిస్థితి దాపురించింది.
ప్రజల హక్కులు హరిస్తున్నారు..
ప్రజల హక్కులను హరించే విధంగా కూటమి పాలకులు ఇసుక దందా చేస్తున్నారు. బూర్జ, ఆమదాలవలస మండలాలకు చెందిన సుమారు ఇరవై గ్రామాల ప్రజలు నిత్యం శ్రీకాకుళానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇసుక లారీల వల్ల రహదారి పూర్తిగా రూపురేఖలు కోల్పోయినా ఇంకా దందా చేస్తూనే ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలి.
– చింతాడ రవికుమార్, వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త

దారుణాలు చూడండి..!

దారుణాలు చూడండి..!

దారుణాలు చూడండి..!

దారుణాలు చూడండి..!