
మన్యం మహిళలకే వన్‌ధన్ వికాస్ కేంద్రాలు
మందస: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ ధన్ వికాస్ కేంద్రాలు కేవలం మన్యం ప్రాంత గిరిజన మహిళలకే అప్పగిస్తామని వెలుగు ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు. గురువారం కొండలోగాం సచివాలయం వద్ద సర్పంచ్ సవర రోజాడిల్లీశ్వర్, ఎంపీటీసీ డిల్లీశ్వరి అధ్యక్షతన ఎంపీడీఓ వై.వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ గౌరవ వర్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గిరిజన గ్రా మాలకు మంచినీరు, విద్య, వైద్యం, పౌష్టికాహారం, శానిటేషన్ అందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ హరికృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి జ్యోత్స్న, వెలుగు క్లస్టర్ కోఆర్డినేటర్ స్వామి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.