
కక్ష కట్టారు..
గతంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నాననే ఒకే ఒక్క కారణంతో నాపై కక్ష కట్టి నా క్రషర్‌ను మూయించేశారు. క్రషర్ నిర్వహణలో 8 ఏళ్లుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల ఆదాయం చెల్లింపులు చేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అండతో ఆయన సోదరుడి ఆదేశాలతో స్థానిక నాయకుల ప్రమేయంతో అధికారులతో పదే పదే దాడులు చేయించి క్రషర్‌ను మూ యించేశారు. గతంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండేవి కావు. నా తల్లి వైఎస్సార్‌సీపీ తరఫున సర్పంచ్‌గా ఉన్నారు. నేను వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండడంతో, ఇలా కక్ష కట్టి క్రషర్‌ను మూయించేశారు. – కిల్లి అజయ్‌కుమార్, బాధిత యజమాని, టెక్కలి
●