
ఫ్లెక్సీలో కానరాని డిప్యూటీ సీఎం
శ్రీకాకుళం క్రైమ్ : పేరుకు కూటమి ప్రభుత్వం అయినప్పటికీ జనసేనను తెలుగుదేశం పార్టీ పట్టించుకో వడం లేదనడానికి గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమమే ప్రత్యక్షంగా సాక్ష్యంగా నిలిచింది. మాదకద్రవ్యాల నిర్మూలన, వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన సభలో అతిథులుగా మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. వేదిక వెనక కట్టిన బ్యానర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, రాష్ట్ర డీజీపీ, ఇతర పోలీసు అధికారుల ను ప్రోటోకాల్‌పరంగా పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఫొటో మాత్రం లేదు. తమ నాయకు డి పరిస్థితే ఇలా ఉంటే తమను ఎవరు పట్టించుకుంటారంటూ జనసేన నాయకులు గుసగుసలాడుకోవడం కనిపించింది.