
నాటుసారా స్వాధీనం
మందస: మండలంలోని గుడ్డికోలా గ్రామంలో గురివారి అనే మహిళ నుంచి 40 లీటర్ల నాటుసారా పట్టుకోవడంతో పాటు, సారా తయారీకి వినియోగిస్తున్న 300 లీటర్ల బెల్లంఊటను ఎకై ్సజ్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆమెను అరెస్టు చేసి సోంపేట కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దాడుల్లో సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ, ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సుజాత, సిబ్బంది భాను ప్రసాద్, రమణ, వెంకటేష్, ఉమాపతి, విజయ్, మార్కరావు, గాలిబ్ తదితరులు పాల్గొన్నారు.