మహిళల టాయిలెట్‌కు తాళాలు | - | Sakshi
Sakshi News home page

మహిళల టాయిలెట్‌కు తాళాలు

Jun 25 2025 1:18 AM | Updated on Jun 25 2025 1:18 AM

మహిళల టాయిలెట్‌కు తాళాలు

మహిళల టాయిలెట్‌కు తాళాలు

జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యారోగ్య శాఖాధి కారి కార్యాలయంలో మహిళా ఉద్యోగుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. మరుగుదొడ్లకు ఏకంగా తాళాలను వేసేయడంతో మహిళా ఉద్యోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. కారణాలు తెలియకపోగా...కార్యాలయ అధికారులకు పలుమార్లు విన్నవిస్తున్నా...పురుషుల టాయిలెట్లను వినియోగించుకోండని పరుషంగా సమాధానాలు వస్తున్నాయని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికై నా డీఎంహెచ్‌ ఓ కార్యాలయంలో మహిళా టాయిలెట్లకు తాళాలు తీయించాలని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి ఫ్లోర్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఎక్కడా మరుగుదొడ్లు వినియోగానికి పనికిరాని విధంగా తయారయ్యాయని, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. – అరసవల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement