
యూబీ బీర్లలో సెడిమెంట్స్
● ఎకై ్సజ్ అధికారుల ల్యాబ్ పరీక్షల్లో వెల్లడి ● అవక్షేపాలు ఉండటంతో బీరుగా గుర్తించని అధికారులు ● మార్కెట్‌కు వెళ్లకుండా అడ్డుకట్ట ● గత ఐదు నెలలుగా కంపెనీకే పరిమితమైన రూ.6కోట్ల విలువైన బీర్లు ● ప్రమాణాల మేరకే ఉన్నాయంటున్న కంపెనీ ప్రతినిధులు
సేగ్రిగేషన్‌కు ఆదేశాలు..
తాజాగా ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ సెడిమెంట్స్(అవక్షేపాలు)తో ఉన్న బాటిల్స్ ప్రతీ ఒక్కదాన్ని పరిశీలించి, సేగ్రిగేషన్(విభజన) చేయాలని యాక్షన్ ప్లాన్ జారీ చేశారు.
●అవక్షేపాలతో ఉన్న బీర్లు ఏవీ? క్లియర్‌గా ఉన్నవేంటి? అనేది విభజన చేయాలని అధికారులను ఆదేశించారు.
●ముగ్గురు నలుగురు అసిస్టెంట్ కమిషనర్ల పర్యవేక్షణలో 30 లేదా 40మంది అనుభవజ్ఞులైన కార్మికులను నియమించాలని, ఒక్కొక్క కార్మికుడు గంటకి 800 నుంచి 1000 బాటిల్స్ పరిశీలించాలని, రోజుకి 8 నుంచి 16 గంటల పాటు షిప్టుగా చేసుకుని 10రోజుల పాటు సేగ్రిగేషన్ చేయాలని ప్రత్యేక షెడ్యూల్ ఇచ్చారు.
●పరిశీలించిన వాటిలో అవక్షేపాలు ఉన్న బాటిల్స్ ఎన్ని, క్లియర్‌గా ఉన్న బాటిల్స్ ఎన్ని నిర్ధారించి, క్లియర్‌గా ఉన్న బాటిల్స్‌ను మరోసారి ప్రభుత్వ ల్యాబ్‌తో పాటు మరో ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయించాలని సూచించారు.
●ఈ నెల 7వ తేదీ నుంచే ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు.
అసలే ప్రభుత్వ ల్యాబ్‌లో అవక్షేపాలున్నట్టు గుర్తించిన బాటిల్స్ అవి.. ఆ పైన వాటి
ఎకై ్స్పరీ డేట్ కూడా సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సేగ్రిగేషన్‌కు ఆదేశాలివ్వడం వెనక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇందులో ఏదో మాయాజాలం, గూడుపుఠాణి నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. 10 రోజుల పాటు పరిశీలించి, ఆ తర్వాత ల్యాబ్‌కు పరీక్షలకు పంపించి, రిపోర్టులు తెచ్చుకునేలోపే ఆ బాటిల్స్ కాలం చెల్లనున్నాయి. ఈ పరిస్థితుల్లో సేగ్రిగేషన్‌కు ఆదేశించడం గమనార్హం. ఒకవేళ సేగ్రిగేషన్‌లో ప్రమాణాల మేరకు ఉన్నాయని తేలినా,
ఎకై ్స్పరీ డేట్ కారణంగా మార్కెట్‌లోకి పంపించడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఇప్పు డెందుకు ఈ తంతు అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. యూబీ ప్రతినిధులు కోరినట్టు మార్కెట్‌లోకి పంపించడానికి వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
రణస్థలంలోని యూబీ కంపెనీలో తయారైన బీర్లు ప్రమాణాల మేరకు లేవా? వాటిలో అవక్షేపాలు ఉంటున్నాయా? మందుబాబుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా బీర్లు ఉంటున్నాయా? అంటే అవుననే అన్పిస్తోంది. గతేడాది నవంబర్, డిసెంబర్‌లో తయారైన బీరు శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌లో పరీక్షించేసరికి డొల్లతనం బయటపడింది. దాదాపు 12,76,128 బీర్లు తేడాగా ఉన్నట్టు గుర్తించారు. 10 బ్యాచ్‌లకు చెందిన సుమారు రూ.6కోట్ల విలువైన బాటిల్స్‌లో తేడా ఉందని నిగ్గు తేల్చారు. యూబీ కంపెనీలో తయారైన ఉత్పత్తులు బీరుగా పాస్ కాలేదని అధికారులు స్పష్టం చేయగా, అన్నీ బాగున్నాయని, తాము చేసిన పరీక్షల్లో ప్రమాణాల మేరకే ఉన్నాయని యూబీ కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క బాటిల్‌ను పరిశీలించి, అవక్షేపాలతో ఉన్న బాటిల్స్ ఏవీ? క్లియర్‌గా ఉన్నవేవీ? గుర్తించాలని ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్ తాజాగా యాక్షన్ ప్లాన్ జారీ చేశారు.
మార్కెట్‌లోకి అనుమతివ్వని అధికారులు..
రణస్థలంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీలో తయారైన బీరు బాటిల్స్‌లో అవక్షేపాలు(సెడిమెంట్స్) కన్పించాయి. సేవించడానికి వీల్లేని బీర్లుగా అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఎకై ్సజ్ ల్యాబ్‌లో సదరు బీరు శాంపిల్స్‌ను పరీక్షించగా, ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ల్యాబ్ నివేదిక ఆధారంగా 267,268,269,270, 271,272, 273, 274, 275, 325బ్యాచ్‌లకు చెందిన 1,60,344 కేసులను (ఒక్కొక్క కేసుకు 12 బాటిల్స్) బీరుగా అధికారులు గుర్తించలేదు. వీటిని మార్కెట్‌లోకి పంపించడానికి వీల్లేదని అభ్యంతరం తెలిపారు. గతేడాది నవంబర్, డిసెంబర్‌లో ఈ ఉత్పత్తులు జరిగాయి. తాము మరో ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో ప్రమాణాల మేరకే ఉన్నాయని యూబీ కంపెనీ ప్రతినిధులు అపీలు చేసుకున్నా అనుమతి లభించలేదు. ప్రస్తుతానికి ఆ బీర్లు అన్నీ యూబీ కంపెనీలో ఉన్నాయి.
సమీపించిన ఎకై ్స్పరీ డేట్..
అధికారులు చేసిన ల్యాబ్ పరీక్షల్లో అవక్షేపాలున్న బీర్లలో 267, 268 బ్యాచ్‌లకు చెందిన 4,01,820 బాటిల్స్ ఈనెల 29న ఎకై ్స్పరీ కానున్నాయి. 3,06,456 బాటిల్స్ ఈనెల 30న, మరో 56,832బాటిల్స్ జూన్4న, 3,59,004 బాటిల్స్ జూన్ 5న, 1,52,016 జూన్ 28న కాలం చెల్లనున్నాయి. అయినప్పటికీ వాటిని మార్కెట్‌లోకి పంపించడానికి అనుమతి ఇవ్వాలని యూబీ ప్రతినిధులు కోరుతున్నారు. తమదైన శైలిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఎౖక్సైజ్ శాఖలోని కొందర్ని ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఇక్కడ తయారైన బాటిల్స్ ఐఎంఎల్ గొడౌన్‌కు పంపించాలి. అక్కడి నుంచి లైసెన్సుడ్ షాపులకు, బార్‌లకు పంపించాలి. ఇదంతా చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపే ఈ బీరు బాటిల్స్ కాలం చెల్లనున్నాయి.

యూబీ బీర్లలో సెడిమెంట్స్

యూబీ బీర్లలో సెడిమెంట్స్

యూబీ బీర్లలో సెడిమెంట్స్