
పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం సరికాదు
● ‘సాక్షి’తో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు టి.తిరుపతిరావు
శ్రీకాకుళం (పీఎన్
కాలనీ): ప్రజల తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించే పత్రికల గొంతు నొక్కే ప్రయత్నాల ను పాలకులు మానుకోవాలని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు టి.తిరుపతిరావు అన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా సోదాలు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
●సమాజంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేసేవి పత్రికలే. అటువంటి వారి గొంతు నొక్కేయాలన్న ప్రయత్నం రాజకీయ పార్టీలు మానుకోవాలి. రాజ్యాంగంలో ఫోర్త్‌ఎస్టేట్‌గా భావించే నాలుగో స్తంభాన్ని విరగ్గొట్టాలని చూడటం పాలకులకు తగదు.
●ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను హరించే రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలు ప్రపంచ చరిత్రలో మనుగడలేకుండాపోయారు.
●కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలుచే యడం మానేసి వాస్తవాల్ని తెలియజేసే పత్రికలు, మీడియాలపై పోలీసులతో కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
●కూటమి ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తున్న సోషల్‌మీడియా వాదులపైనా కేసులు పెట్టడం దారుణం.
●ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని తరహాలు రెడ్‌బుక్ పేరిట కక్షసాధింపులు చర్యలు చేపడుతున్నారు. ఇటువంటివి తగ్గించుకుని ప్రజలకిచ్చే హామీలపై దృష్టి సారిస్తే మంచిది.
●పత్రికాస్వేచ్ఛను కాపాడితేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. లేదంటే కార్పొరేట్ శక్తులకు, రియల్టర్ల హవా కొనసాగి సామాన్యుడికి తిండిలేని దుస్థితికి ప్రభుత్వాలు తీసుకొస్తాయి.
ప్రజాస్వామ్యం బతికేదెలా..
ప్రభుత్వం
ఇలా

పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం సరికాదు