
పత్రికల గొంతు నొక్కేయడం సరికాదు
ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాల్ని ప్రజలకు తెలియజేసేందుకే ప్రతికలు ఉన్నాయి. అలాంటిది ఎడిటర్ స్థాయి వ్యక్తి ఇంటిలో పోలీసులు తనిఖీలు చేసి భయపెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
– కంఠ వేణు, దళిత సంఘాల జేఏసీ నాయకుడు
పత్రికా స్వేచ్ఛకు భంగం
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు. ఎడిటర్ ఇంటికి ముందస్తు సమాచారం లేకుండా వెళ్లి భయబ్రాంతులకు గురిచేయడం హేయం. ప్రజలకిచ్చిన హామీలను అమలుచేసి ప్రజాసంక్షేమానికి పాటుపడాలే తప్ప ఇలా దాడులు చేయడం సరికాదు.
– డి.గణేష్, సామాజిక న్యాయపోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి
తలసేమియా బాధితుల కోసం రక్తమార్పిడి కేంద్రం
శ్రీకాకుళం కల్చరల్: ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా బాధితుల కోసం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఏర్పాటు చేసిన రక్తమార్పిడి కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర రెడ్‌క్రాస్ అధ్యక్షుడు అబ్దుల్ నజీర్ వర్చువల్ విధానంలో గురువారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తలసేమియా బాధితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలసేమియా బాధితుల కోసం రక్తమార్పిడి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రతి బుధవారం తలసేమియా బాధిత పిల్లలకు రక్తమార్పిడి జరుగుతుందని, అవసరమైన వైద్యపరీక్షలు చేయిస్తామని తెలిపారు. రానుపోను రవాణా ఖర్చులు, పౌష్టిక ఆహారం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆరుగురికి రక్త మార్పిడి చేయగా, శివాని గ్రూప్ ఆఫ్ కాలేజీలకు చెందిన 30మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
‘మావోయిస్టులతో చర్చలు జరపాలి’
పలాస: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కగార్‌ను ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వివిధ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. పలాస మండలం బొడ్డపాడు జిల్లా అమరవీరుల స్మారక మందిరంలో గురువారం ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా సదస్సు జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట జరుతున్న యుద్ధం వల్ల దండకారణ్యంలో ఆదివాసీల జీవితాలు ఛిద్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 14 నెలల్లో 450 మంది ఆదివాసీలను అమానుషంగా హత్య చేశారని, ఇది అప్రజాస్వామ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎల్పీ నాయకుడు దానేసు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కా ర్యదర్శి తాండ్ర ప్రకాష్, సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సీపీఎం జిల్లా నాయ కుడు కె.మోహనరావు, లిబరేషన్ నాయకులు దుష్యంత్, మద్దిల రామారావు పాల్గొన్నారు.
●

పత్రికల గొంతు నొక్కేయడం సరికాదు

పత్రికల గొంతు నొక్కేయడం సరికాదు

పత్రికల గొంతు నొక్కేయడం సరికాదు