
కొందరికే కొత్త పింఛన్లు
● పాత ఐడీ ఉన్న వితంతువులకే పింఛన్లు
● ఐడీ లేని విడోలకు పింఛను లేదు
● కొత్త పింఛన్లకు నోచుకోని దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు
● 50 ఏళ్ల పింఛన్ హామీ బూటకమే
శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లలోనూ మెలికలు పెడుతోంది. ఎన్నికలు జరిగిన నాటి నుంచి దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు పింఛన్ల కోసం కళ్లు కాయ లు కాసేలా ఎదురు చూస్తుంటే కొందరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లు తప్ప కొత్తవారికి ఒక్క పింఛను ఇవ్వలేదు. కేవలం పింఛను పెంచామని కూటమి పాలకులు బాకాలు ఊదుతున్నారు తప్ప కొత్త వారి పరిస్థితిపై ఎవరూ మాట్లాడటం లేదు.
50 ఏళ్ల పింఛన్ ఊసే లేదు
● ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. కానీ ఇప్ప టివరకు దానిపై ఎలాంటి కసరత్తు చేయలేదు.
● దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మెడికల్ పింఛను దారులు వేల సంఖ్యలో పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరినీ ప్రభుత్వం కరుణించలేదు.
● తాజాగా ప్రభుత్వం వితంతు పింఛను మంజూరుకు అనుమతులు ఇచ్చింది. దీంతో చాలా మంది వితంతువులకు పింఛను వస్తుందని ఆశ పడ్డారు. అయితే దీనిలో మెలిక పెట్టారు. గతంలో పింఛను పొంది, ఆ వ్యక్తి పింఛన్ ఐడీ కలిగి ఉండి, ఆయన మరణిస్తే అతని భార్యకు మా త్రమే వితంతువు పింఛను ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చారు. భర్త పింఛను భార్యకు తప్ప ఇతర వితంతువులకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు.
● మే నెలకు గాను జిల్లాకు 3.10 లక్షల పింఛన్లు విడుదలయ్యాయి. ఈ పింఛన్లు గత ఏడాదిగా ప్రతి నెలా తగ్గుతూ వస్తున్నాయి.
● ఇవన్నీ పాత పింఛన్లే. కొత్తగా చనిపోయిన వారి స్థానంలో 4623 పింఛన్లు మంజూరు కావాల్సి ఉండగా.. వీటిలో కూడా కోత పెట్టేందుకు ప్రభుత్వం సాకులు వెతుకుతోంది.
● జిల్లాలో గత ఏడాదిన్నరగా 4623 మంది పింఛన్‌దారులుమరణించినట్టు చెబుతున్నారు. అయి తే వీరి ఐడీల ద్వారా వారి భార్యలకు (స్పౌజ్) లో 2911 పింఛన్లు మాత్రమే ఇవ్వనున్నారు.
● ఒక కుటుంబంలో భర్త పింఛను పొందుతూ 01.12.2023 నుంచి 31.10.2024 మధ్య మరణిస్తే.. అలాంటి పింఛనుదారు భార్యకు మాత్ర మే వితంతు పింఛను మంజూరు చేశారు. ఇతరులకు మొండి చేయిచూపారు.
● భర్త పింఛన్‌దారుడు కాకపోతే.. వితంతువైనా పింఛన్ కోసం దరఖాస్తు చేసేందుకు అనుమతులు లేవు.