
ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ల విలీనం
శ్రీకాకుళం అర్బన్: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామీణ ప్రాంతీయ బ్యాంక్‌ల విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు బ్యాంక్ రీజనల్ మేనేజర్ లావేటి అనంతరావు మంగళవారం తెలిపారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్(సీజీజీబీ), సప్తగిరి గ్రామీణ బ్యాంక్(ఎస్‌జీబీ) తదితర బ్యాంక్‌లన్నీ విలీనమై మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా ఏర్పడతాయని చెప్పారు. ఖాతాదారుల నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్రాంచి చిరునామాలలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు చేయడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న అన్ని సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు.
సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
శ్రీకాకుళం అర్బన్: జిల్లా విద్యాశాఖాధికారి వెబ్‌సైట్‌లో ఉన్న సీనియారిటీ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మే 2వ తేదీ సాయంత్రం 5గంటలలోగా తెలియజేయవచ్చని డీఈవో ఎస్.తిరుమలచైతన్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడువు దాటిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.