సెకెండియర్‌లో 74 శాతం..
ఇంటర్మీడియెట్ సెకెండియర్ ఫలితాల్లో 74 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో 23వ స్థానం సాధించారు. ఒకేషనల్‌లో మాత్రం ముందు వరుసలో నిలిచారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,942 మంది పరీక్ష రాయగా 13,309 మంది పాసయ్యారు.
పేపర్ బాయ్‌కు 981 మార్కులు
కంచిలి: కంచిలి పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఇరోతు సాయిగణేష్ ఎంపీసీ విభాగంలో 981 మార్కులు సాధించి శెభాష్ అనిపించాడు. మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో పేపర్ బాయ్‌గా పనిచేస్తూ చదువులో రాణించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. –సాయిగణేష్ (981 ఎంపీసీ)
శాలిహుండం కేజీబీవీలో శతశాతం ఉత్తీర్ణత
గార: మండల పరిధిలోని శాలిహుండం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో శతశాతం ఫలితాలు నమోదయ్యాయి. ఫస్టియర్ బైపీసీలో 37 మందికి గానూ అందరూ ఉత్తీర్ణులవ్వగా ఎన్.మౌనిక 431 మార్కులు సాధించింది. సెకెండియర్‌లో 35 మంది ఉత్తీర్ణులవ్వగా బి.షాలిని 953 మార్కులు సాధించింది.
– బి.షాలిని(బైపీసీ 953)
బాధను అధిగమించి..
మందస: మందసకు చెందిన శివానీ పండా అద్భుత ఫలితం సాధించింది. ఓవైపు పేదరికం, మరోవైపు తండ్రి మరణం అయినా వెనకడుగు వేయకుండా హరిపురంలోని ఓ కళాశాలలో పట్టుదలతో చదివింది. ఇంటర్ సీఈసీ గ్రూపులో 483 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది.
– శివానీ పండా(సీఈసీ 483)
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో శ్రీకాకుళం విద్యార్థులు నిరాశపరిచారు. శనివారం వెలువడిన ఫలితాల్లో గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం మెరుగుపడినప్పటికీ రాష్ట్రస్థాయిలో మాత్రం వెనుబడ్డారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలురు కంటే బాలికలే పైచేయి సాధించారు.
–శ్రీకాకుళం న్యూకాలనీ
● ఇంటర్మీడియెట్ ఫలితాల్లో
అట్టడుగు స్థాయిలో శ్రీకాకుళం
● సీనియర్ ఇంటర్‌లో 74 శాతం
ఉత్తీర్ణతతో 23వ స్థానం
● జూనియర్ ఇంటర్‌లో 63 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం
ఫస్టియర్‌లో 63 శాతం ఉత్తీర్ణత..
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు గత ఏడాదితో కాస్త పోలిస్తే మెరుగనిపించారు. గత ఏడాది 57 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 63 శాతం ఉత్తీర్ణతను సాధించి జిల్లాల పునర్విభజన(26జిల్లాలు) రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచారు. ప్రథమ సంవత్సరంలో 19,693 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 12,478 మంది ఉత్తీర్ణులయ్యారు.
సెకెండియర్‌లో 74 శాతం..
సెకెండియర్‌లో 74 శాతం..
సెకెండియర్‌లో 74 శాతం..
సెకెండియర్‌లో 74 శాతం..


