పెను ప్రమాదం తప్పింది!
హమ్మయ్యా..
ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారిపై ఫరీదుపేట కూడలి కొయ్యరాళ్లు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారికి స్వల్ప గాయాలు కాగా, ఆమె తల్లిదండ్రులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసింహమూర్తి అనే ఉపాధ్యాయుడు విధులు ముగించుకుని శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీలోని తన నివాసానికి కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఒడిశా వైపు వెళుతున్న కారు కొయ్యరాళ్లు సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పి ఉపాధ్యాయుడి కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో టీచర్ కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఒడిశా వైపు వెళ్తున్న కారులో చిన్నారి లిఖితకు స్వల్ప గాయాలయ్యాయి. భార్యాభర్తలకు ఎటువంటి గాయాలు కాలేదు. ఎచ్చెర్ల ఎస్సై సందీప్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.
హైవేపై రెండు కార్లు ఢీ
చిన్నారికి గాయాలు.. క్షేమంగా బయటపడిన తల్లిదండ్రులు
పెను ప్రమాదం తప్పింది!
పెను ప్రమాదం తప్పింది!


