వివాహితను కర్కశంగా నరికి చంపిన ఆటో డ్రైవర్‌ | - | Sakshi
Sakshi News home page

వివాహితను కర్కశంగా నరికి చంపిన ఆటో డ్రైవర్‌

Jul 3 2024 1:24 AM | Updated on Jul 3 2024 12:54 PM

-

పొందూరు: మండలంలోని తాడివలస సమీపంలో చిన్న బొడ్డేపల్లి గ్రామానికి చెందిన వివాహిత హత్య మంగళవారం సంచలనం రేపింది. వివాహితను హత్య చేసిన ఆటోడ్రైవర్‌ ఆమె మృతదేహాన్ని నేరు గా పొందూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

చిన్నబొడ్డేపల్లి గ్రామానికి చెందిన అచ్చయ్య, రాజులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అమలాపురపు రాజేశ్వరి భర్త గుప్తేశ్వరరావు మూడేళ్ల కింద ట అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆమె తన కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుమార్తెతో పాటు తల్లిదండ్రులను పోషిస్తున్నారు. రెండు నెలల కిందట బొడ్డేపల్లి రైల్వేట్రాక్‌ పనులకు వచ్చిన నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామానికి చెందిన ఆముజూరు గోపాల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

 గ్రామంలోనే వారిద్దరూ తరచూ కలిసేవారు. మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి వెళ్లడానికి సిద్ధమైన రాజేశ్వరి గోపాల్‌కు ఫోన్‌ చేసింది. గోపాల్‌ ఆటోపై చిన్నబొడ్డేపల్లికి వచ్చాడు. ఆటోలో ఇద్దరూ వాల్తేరుకు బయ లుదేరారు. అయితే తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. గోపాల్‌ తనతో తెచ్చుకున్న చాకుతో రాజేశ్వరి మెడపై పలుమార్లు దాడిచేశాడు. దీంతో రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. 

మృతి చెందిన రాజేశ్వరిని గోపాల్‌ తన ఆటోలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. ఆమదాలవలస సీఐ దివాకర్‌యాదవ్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విచారణ చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులు అచ్చయ్య, రాజు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేశారు. హత్య చేసిన గోపాల్‌తో కలి సి హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement