
మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ నవీన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని మహేంద్ర తన య ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్ (రేగులపాడు రిజర్వాయర్) పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జా యింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో పెండింగ్ పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్ కింద ఆయా గ్రా మాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతులు, ఇతర సదుపాయాలపై ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ, ఆర్‌డబ్ల్యూ, ఎస్‌నెడ్‌క్యాప్, టెక్కలి సబ్ కలెక్టర్, ఏపీఈపీడీసీఎల్ శాఖల ద్వారా పనులు అప్పగించినట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో మాట్లాడి పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్ డాక్టర్ జి.జయదేవి, పలాస రెవెన్యూ డివిజినల్ అధికారి సీతారామ్మూర్తి వంశధార పర్యవేక్షక ఇంజినీర్ డోల తిరుమలరావు, ఇతర అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.