
మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ మీనాక్షి
అరసవల్లి: కోవిడ్ మహమ్మారిపై జిల్లా వైద్యారోగ్య శాఖ యంత్రాంగం అప్ర మత్తంగానే ఉందని, గత అనుభవాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు, చర్యలపై దృష్టి సారించామని జిల్లా వైద్యారోగ్య శాఖాఽధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి తెలిపా రు. ఆమె శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు అక్కడక్కడా నమోదవుతున్నాయని, అయితే ఇంతవరకు మన జిల్లాలో కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. అయితే జిల్లా జనరల్ ఆస్పత్రిలో శాంపిల్ యూనిట్ సేకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నామని, అలాగే అన్ని గ్రామ సచివాలయాల పరిధిలోని వైఎస్సార్ విలేజి హెల్త్ క్లినిక్స్‌లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను అందుబాటులో ఉంచామని వివరించారు. ఎవరిౖకైనా అనుమానాలుంటే పరీక్షలు చేయించుకోవచ్చునని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు గా 80 శాతం వరకు ఫీవర్ సర్వే పూర్తి చేశామని, ఇంకా గ్రామాల్లో ఈ ప్రక్రి యను కొనసాగిస్తున్నామని తెలిపా రు. ప్రస్తుతం జిల్లాలో వైరల్ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారని, అలాగే ఒళ్లు నొప్పులు, తలనొప్పి, దగ్గు, జ్వర లక్షణాలున్నవారు హెచ్3ఎన్2 వైరస్, మలేరియా, డెంగీ, కోవిడ్ పరీక్షలను చేయించుకుంటే మంచిదని, ఇవన్నీ మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే చేయించుకోవచ్చునని ఆమె వివరించారు.
జిల్లాలో ఇప్పటివరకు కోవిడ్ కేసులు అధికారికంగా నమోదు కాకపోయినప్పటికీ, ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లేవారు మాత్రం పరీక్షలు చేయించుకోవడం మంచిదని తెలిపారు.
ఇంతవరకు జీరో కేసులు
జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి
డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి