9, 10 తేదీల్లో ప్రపంచ సాహితీ బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

9, 10 తేదీల్లో ప్రపంచ సాహితీ బ్రహ్మోత్సవాలు

Apr 1 2023 1:58 AM | Updated on Apr 1 2023 1:58 AM

చాకిపల్లిలో ప్రాథమిక పాఠశాలను 
ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి  
 - Sakshi

చాకిపల్లిలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీశ్రీ కళా వేదిక, ఇంద్రాణి చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 9, 10 తేదీలలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బుర్రి కుమార్‌రాజా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సాహితీకారులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా శ్రీశ్రీ కళా వేదిక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవ కార్యక్రమ ఆర్గనైజర్‌ మహ్మద్‌ రఫీ (ఈవేమన ) మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్‌ డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌ ఆధ్వర్యంలో కన్వీనర్‌ రమావతి పర్యవేక్షణలో జరిగే బ్రహ్మోత్సవాల సభకు కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళా వేదిక కార్యదర్శి వావిలపల్లి రాజారావు, కవి, సంపాదకులు జంధ్యాల శరత్‌బాబు, ఉదయకిరణ్‌, కె.వి.రాజారావు పాల్గొన్నారు.

విద్యారంగానికి

అధిక ప్రాధాన్యం

పాతపట్నం: విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. చాకిపల్లి గ్రామానికి నూతనంగా మంజూరైన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకిపల్లిలో ఎయిడెడ్‌ పాఠశాల ఉండేదని, దానిని మూసివేయడంతో పాఠశాల కోసం గ్రామస్తులు పోరాటం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పాఠశాలను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఎం.శ్యామ్‌సుందరావు, ఏఎంసీ చైర్మన్‌ కె.అర్జునుడు, శవ్వాన ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ జయంత్‌ ప్రసాద్‌, ఈఓపీఆర్‌డీ ప్రసాద్‌ పండా, పాతపట్నం, సారవకోట ఎంఈఓలు సీహెచ్‌ మణికుమార్‌, మడ్డు వెంకటరమణ, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్‌.మురళీ, రాంబుక్త, డి.సంజీవరావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

దుర్గ్‌–బరంపురం మధ్య

కొత్త రైలు నడపాలి

వజ్రపుకొత్తూరు రూరల్‌: దుర్గ్‌ నుంచి పలాస మీదగా బరంపురం వరకు కొత్త రైలు నడపాలని కోరుతూ శుక్రవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్టవ్‌కు దుర్గ్‌ ఎంపీ పి.విజయ్‌ భాగెల్‌తో కలిసి వినతిపత్రం అందించినట్లు ఆంధ్ర ఉత్కళ సంఘర్షణ సమితి అద్యక్షుడు, రైల్వే బోర్డు సలహా కమిటీ సభ్యుడు కర్రి ఉమాశంకర్‌ తెలిపారు. కొత్త రైలు అందుబాటులోకి వస్తే దుర్గ్‌, విజయనగరం, పలాస, బరంపురం తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. వినతిపత్రం అందించిన వారిలో సమితి సభ్యులు డాక్టర్‌ ఎస్‌.ఆదినారాయణ, అండ శ్రీనివాసరావు, రోషన్‌ కుమార్‌, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైల్వే మంత్రికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు 1
1/2

రైల్వే మంత్రికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం 2
2/2

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement