సాంకేతిక దీప్తి.. జాతీయ కీర్తి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక దీప్తి.. జాతీయ కీర్తి

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

అనంతపురం: సాంకేతిక విద్యలో అనంతపురం జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం (జేఎన్‌టీయూ–ఏ) జాతీయస్థాయిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాజానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్‌ నిపుణులను అందించిన ఘనతను సొంతం చేసుకుంది. అంతేకాదు నాణ్యమైన పరిశోధనలకూ చిరునామాగా నిలిచింది. ఈ క్రమంలో జేఎన్‌టీయూ(ఏ) 15వ స్నాతకోత్సవం సోమవారం జరగనుంది. ఏపీ గవర్నర్‌, యూనివర్సిటీ చాన్సలర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు. గవర్నర్‌ హోదాలో మూడో దఫా జేఎన్‌టీయూ (అనంతపురం)కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్‌ అందజేయనున్నారు. మిస్సైల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియాగా టెస్సీ థామస్‌ను పిలుస్తారు. అగ్ని–4, అగ్ని–5 క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

● జేఎన్‌టీయూ (ఏ) స్నాతకోత్సవం సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో జరగనుంది. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరై బంగారు పతకాలు పొందిన వారికి స్వయంగా అందజేస్తారు. పీహెచ్‌డీలను టెస్సీ థామస్‌తో పాటు జేఎన్‌టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌.సుదర్శనరావు అందజేస్తారు. స్నాతకోత్సవంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ పాస్‌లు అందజేశారు.

కట్టుదిట్టమైన భద్రత..

జేఎన్‌టీయూ అనంతపురం స్నాతకోత్సవానికి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ విచ్చేస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వీసీ హెచ్‌.సుదర్శనరావు పేర్కొన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం మరో కాన్‌స్టిట్యూట్‌ కళాశాలగా శ్రీ కాళహస్తీశ్వర కళాశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల, ఓటీపీఆర్‌ఐ, కలికిరి తరహాలో శ్రీకాళహస్తీశ్వర కళాశాలను కాన్‌స్టిట్యూట్‌ కళాశాలగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆదివారం ఆయన యూనివర్సిటీలో మీడియాతో మాట్లాడారు. స్నాతకోత్సవ ముఖ్యాంశాలను వివరించారు. లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కృష్ణయ్య, ఓఎస్డీ టూ వీసీ ప్రొఫెసర్‌ ఓ.దేవన్న, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ వి.నాగప్రసాద్‌ నాయుడు, డైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.వి.సత్యనారాయణ, పీఆర్వో డాక్టర్‌ అంకారావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, స్నాతకోత్సవ సన్నద్ధత కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

40 వేల మందికి డిగ్రీలు

జేఎన్‌టీయూ (ఏ) 15వ స్నాతకోత్సవంలో మొత్తం 40,782 మందికి డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. పీహెచ్‌డీలు 97, ఎంటెక్‌ 1,197, ఫార్మా డీ 52, ఎం ఫార్మసీ 978, ఎంబీఏ 6,675, ఎంసీఏ 3,297, ఎమ్మెస్సీ 47, డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ 626 డిగ్రీలతో పాటు బీటెక్‌ సివిల్‌ 1533, ఈఈఈ 2,646, మెకానికల్‌ 1683, ఈసీఈ –6852, సీఎస్‌ఈ–11,274, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ – 72, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌– 12, కెమికల్‌ ఇంజినీరింగ్‌– 63, ఈఐఈ – 12, ఐటీ –274, సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ –13, కంట్రోల్‌ ఇంజినీరింగ్‌–01, ఫుడ్‌ టెక్నాలజీ – 24, కంప్యూటర్స్‌ అండ్‌ టెక్నాలజీ –42, బీఫార్మసీ 3,312 డిగ్రీలు ప్రదానం చేస్తారు.

జేఎన్‌టీయూ బంగారాలు వీరే..

జీవితంలో గోల్డ్‌ మెడల్‌ సాధించడం ఒక కల. లక్ష్యాన్ని నిర్దేశించి ప్రతిభ చాటి యూనివర్సిటీ స్థాయిలో సత్తా చాటారు. మెరిట్‌ సాధించడంతో బంగారు పతకాలకు ఎంపికయ్యారు. 89.5 శాతం ఉత్తీర్ణత సాధించి యూనివర్సిటీలోనే టాపర్లుగా నిలిచారు.

జేఎన్‌టీయూ అనంతపురం నుంచి..

ఎంటెక్‌లో ఆర్‌.ముస్తాక్‌ బాషా (సివిల్‌– స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌), కె.వాజిత సుల్తానా (ఈఈఈ– పవర్‌ సిస్టమ్‌)కు గోల్డ్‌మెడల్‌ దక్కాయి.

జేఎన్‌టీయూ పులివెందుల

ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి..

ఎస్‌.నౌషిన్‌ (సివిల్‌), టి.కిరణ్‌ (ఈఈఈ), ఎన్‌.వెంకటేశ్‌ (మెకానికల్‌), పి.ధనశ్రీ (ఈసీఈ), జి.కావేరి (సీఎస్‌ఈ )లకు గోల్డ్‌మెడల్స్‌ దక్కాయి.

నేడు జేఎన్‌టీయూ (ఏ)

15వ స్నాతకోత్సవం

హాజరు కానున్న గవర్నర్‌

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

స్నాతకోత్సవానికి 40 వేల మంది విద్యార్థుల దరఖాస్తు

74 మందికి డాక్టరేట్లు..

31 మందికి బంగారు పతకాలు

మిస్సైల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా

టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement