నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించు కోవచ్చని సూచించారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌ రాం

ప్రశాంతినిలయం: దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రాం బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో జగ్జీవన్‌ రాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ మాట్లాడుతూ జగ్జీవన్‌ రాం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారన్నారు. అందరూ తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని, అప్పుడే అటువంటి మహాత్ముల ఆశయాలకు సార్థకత చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌, షెడ్యూల్‌ కులాల సంక్షేమ శాఖ అధికారి మోహన్‌రాం తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‌ పర్యటనకు

పటిష్ట బందోబస్తు

పుట్టపర్తి టౌన్‌: రాష్ట్ర గవర్నర్‌ నజీర్‌ అహమ్మద్‌ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం స్థానిక సత్యసాయి విమానాశ్రయం, ప్రశాంతి నిలయంలో బందోబస్తు ఏర్పాట్లు, కాన్వాయ్‌ రూట్లను ఎస్పీ సతీష్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం అనంతపురంలోని జేఎన్‌టీయూలో జరగనున్న 15వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్‌ నజీర్‌ అహమ్మద్‌ రానున్నారన్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10.10 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, ఇక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌ ద్వారా రోడ్డు మార్గాన అనంతపురం బయలుదేరి వెళ్తారన్నారు. స్నాతకోత్సవం ముగిసిన అనంతరం ప్రశాంతి నిలయంలోని శ్రీనివాస గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారని చెప్పారు. సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుని సాయంత్రం తిరిగి విజయవాడ బయలుదేరతారన్నారు. గవర్నర్‌ పర్యటన ముగిసేంత వరకూ అప్రమత్తంగా విధులు నిర్వహించాని పోలీసులను ఆదేశించారు. లోటుపాట్లు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement