గాండ్లపెంట: మండలంలోని జీనులకుంట గ్రామానికిచెందిన కొర్రపాటి తులసీధరరెడ్డి కుమారుడు సోమేశ్వరరెడ్డి కనిపించడం లేదు. ఓడీసీలోని విజ్ఞాన్ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సోమవేశ్వరరెడ్డి వారం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో గాండ్లపెంటలో తండ్రి బస్సు ఎక్కించాడు. అయితే బాలుడు పాఠశాలకు వెళ్లలేదు. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు.
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: పాత కక్షల నేపథ్యంలో యువకుడిని హతమార్చేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం వన్‌టౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో పాతూరులోని ఆసార్ స్ట్రీట్‌కు చెందిన కటిక మహమ్మద్ సాధు, మున్నా నగర్ నివాసి షేక్ షౌకత్ ఆలీ, మూడో రోడ్డుకు చెందిన కట్టుబడి జహీర్‌బాషా ఉన్నారు. వీరు ఇటీవల పాతూరులోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఆకుల శ్రీనివాసులుపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.


