వైద్యం దూరం చేసే కుట్ర
పెనుకొండ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు అప్పటికే 20 శాతం పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనాలను, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం సరికాదు. దీనివల్ల పేదలకు వైద్యం దూరమవుతుంది. దీనిపై ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఆర్డీఓతో పాటు ఇతర అధికారులకు వినతి పత్రాలు సమర్పించాం. పేద విద్యార్థులు మెడికల్ విద్యను చదవాలన్నా, సామాన్యులను నాణ్యమైన వైద్యం అందాలన్నా మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. – శివ కుమార్,
ఏఐఎస్‌ఏ విద్యార్థి సంఘం నాయకుడు


