సమయపాలన లేకపోతే ఎలా?
అగళి: సమయపాలన పాటించడంలో అలసత్వం వీడాలని, లేకపోతే చర్యలు తప్పవని ఆగళి పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బందిని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం హెచ్చరించారు. స్థానిక పీహెచ్‌సీని బుధవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలతో పాటు పలు రికార్డులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. వైద్యులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తూ 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివానంద, సిబ్బంది పాల్గొన్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
పీహెచ్‌సీలో బుధవారం విలేకరుల సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. కొమరేపల్లి పంచాయతీ నుంచి ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 14 వరకూ 3,982 జారీ అయిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల అంశంలో విచారణ కొలిక్కి వచ్చిందని, ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారుల జారీ చేసే ఆదేశాల మేరకు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పీహెచ్‌సీలో తనిఖీలు
గుడిబండ: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం బుధవారం తనిఖీ చేశారు. వ్యాక్సిన్ నిల్వలు, రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి వెంగళరావు, సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య సిబ్బందిని నిలదీసిన డీఎంహెచ్‌ఓ


