శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
● బాధ్యతలు తీసుకున్న
ఏఎస్పీ అంకిత సురాన
పుట్టపర్తి టౌన్: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామని నూతన అడిషనల్ ఎస్పీ అంకిత సురాన మహవీర్ అన్నారు. శుక్రవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ సతీష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎస్పీ, ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు పరిరక్షణకు పాటుపడతామన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ పారదర్శకమైన పోలీసింగ్ వ్యవస్థ అందిస్తామని తెలిపారు. అనంతరం ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏఓ సుజాత, సూపరింటెండెంట్ సరస్వతి, మల్లికార్జున, సీసీ చిరంజీవి, స్పెషల్ బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు వలి, మహేష్, రవికుమార్, సీఐలు ఆర్‌ఎస్‌ఐలు సిబ్బంది నూతన ఏఎస్పీకి బోకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
మెడికల్ కళాశాలల
ప్రైవేటీకరణ దుర్మార్గం
● అక్రమ అరెస్టులతో
ఉద్యమాలను ఆపలేరు
● విద్యార్థి సంఘాల నాయకులు
ధర్మవరం అర్బన్: పేదలకు మేలు చేసే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలనుకోవడం దుర్మార్గమని, కూటమి ప్రభుత్వం వెంటనే ఆ ఆలోచన విరమించుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ధర్మవరం మీదుగా కళ్యాణదుర్గం వెళ్తున్న రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేష్‌ను కలిసి విద్యారంగ సమస్యలు విన్నవించాలనుకున్న విద్యార్థి సంఘాల నాయకులను టూటౌన్ సీఐ రెడ్డెప్ప అరెస్టు చేసి స్టేషన్‌లో ఉంచారు. ఈ సందర్భంగా పీఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, ఏఐఎస్‌బీ నేత పోతలయ్య, ఏఐవైఎఫ్ నేత రాజా మాట్లాడారు. మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 590ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, రుచికరమైన భోజనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఏఐఎస్‌బీ నాయకులు జగదీష్, మురళి, పీఎస్‌యు జిల్లా అధ్యక్షుడు నందకిషోర్ తదితరులు ఉన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం


