పాలిటెక్నిక్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ‘పురం’ ఫస్ట్
హిందూపురం: డి–ఫార్మసీ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. హిందూపురం మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని ఎస్.షాజియా భాను 990 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ జి.కృష్ణమూర్తినాయుడు తెలిపారు. అలాగే ఎస్.అమీనా త్యాహ్రిమ్ (969), జి.గ్రీష్మ సాయిరెడ్డి (962), ఎస్.సానియా సుల్తానా (962), ఎస్.అమ్రీన్‌భాను (943), ఎస్.ఆర్షియా (933), ఎస్.శాసిస్తాభాను (923), ఎం.పూజ (922), ఆర్.ఎస్.ముతహిర (921), ఎన్.సుఫియా సార (906) మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఐదేళ్లుగా హిందూపురం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలుస్తూ రావడం గర్వకారణమన్నారు. విజయంలో తమదైన పాత్ర పోషించిన కళాశాల ఫార్మసీ సిబ్బందిని అభినందించారు.
పాలిటెక్నిక్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ‘పురం’ ఫస్ట్


