ఆకట్టుకున్న ఓపెన్ హౌస్
పుట్టపర్తి టౌన్: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు మహేష్, వలి, రవికుమార్ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు వినియోగించే వివిధ రకాల ఆయుధాల పనితీరును వివరించారు. నేర పరిశోధన విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలాల ప్రదర్శన అబ్బురపరిచింది. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఐలు వీరన్న, వెంకటేశ్వర్లుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


