సర్కారు బడుపై వివక్ష చూపారు
రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన 4,168 మంది విద్యార్థులను కూటమి ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్’ అవార్డులతో సత్కరించింది. ఇందులో 3 వేల మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు చెందిన వారే ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ఈ ప్రభుత్వానికి సర్కారు బడి పిల్లలపై ఉన్న వివక్ష ఏపాటిదో అర్థమవుతోంది. గత ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరిస్తే వారిలో అత్యధిక శాతం సర్కారు బడి పిల్లలే ఉన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏమిటో తెలుసుకునేందుకు ఇదొక్కటే చాలు. – పీవీ రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌టీఎఫ్


