అప్‌గ్రేడ్‌ .. అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

అప్‌గ్రేడ్‌ .. అస్తవ్యస్తం

Oct 28 2025 8:10 AM | Updated on Oct 28 2025 8:10 AM

అప్‌గ

అప్‌గ్రేడ్‌ .. అస్తవ్యస్తం

ది అగళి మండలం హళ్లికెర పంచాయతీలోని అమ్మాజీ క్షేత్రం మినీ అంగన్‌వాడీ కేంద్రం. ఇక్కడ కార్యకర్తగా ఉన్న మహాలక్ష్మి 2016లో పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన కార్యకర్తలున్న మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్‌ చేసిన ప్రభుత్వం...అమ్మాజీ క్షేత్రం మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని మాత్రం విస్మరించింది. కానీ మడకశిర మండలంలోని కోనప్ప పాళ్యం మినీ అంగన్‌వాడీ కేంద్రం కార్యకర్త నాగమణి పదో తరగతి పూర్తి చేయకపోయినా ఆ కేంద్రాన్ని అప్‌గ్రేడ్‌ జాబితాలో చేర్చారు.

మడకశిర: జిల్లాలో మినీ అంగన్‌వాడీ కేంద్రాల అప్‌గ్రేడ్‌ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవలే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం మినీ అంగన్‌వాడీ కేంద్రంలోని కార్యకర్త పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉంటే అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ జిల్లాలో ఇష్టారాజ్యంగా సాగింది.

అర్హులకు అన్యాయం..

జిల్లాలో 12 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో 2,824 అంగన్‌వాడీ కేంద్రాలుండగా... ఇందులో 618 మినీ అంగన్‌వాడీలున్నాయి. ఇందులో 548 అప్‌ గ్రేడ్‌ అయ్యాయి. అర్హత ఉన్నా 45 మినీ అంగన్‌వాడీలు అప్‌ గ్రేడ్‌కు నోచుకోలేదు. ఈ కేంద్రాల్లో పని చేసే కార్యకర్తలందరూ టెన్త్‌ పాసయ్యారు. అయినా ఈ కేంద్రాలను కూటమి ప్రభుత్వం అప్‌ గ్రేడ్‌ చేయకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పుట్టపర్తి ప్రాజెక్టులో 6, సోమందేపల్లిలో 6, ఓడీసీలో 9, పెనుకొండలో 7, నల్లచెరువులో 5, హిందూపురంలో 5, బత్తలపల్లి ప్రాజెక్టులో 3, మిగిలిన ప్రాజెక్ట్‌ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మినీ అంగన్‌వాడీ కేంద్రాలు అర్హత ఉన్నా... అప్‌ గ్రేడ్‌ జాబితాలో లేవని సంబంధిత అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే విధంగా అర్హత లేకపోయినా మడకశిర ప్రాజెక్టులో 1, నల్లచెరువు 2,పెనుకొండ ప్రాజెక్టులో 1 చొప్పున మినీ అంగన్‌వాడీ కేంద్రాలు అప్‌ గ్రేడ్‌ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ కేంద్రాల్లో పని చేసే కార్యకర్తలు టెన్త్‌ పాస్‌ కాకపోయినా ఆ కేంద్రాలను అప్‌ గ్రేడ్‌ జాబితాలో ఉండడంపై విమర్శలకు దారి తీస్తోంది.

కార్యకర్తలకు నష్టం..

ప్రస్తుతం మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.7 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రం...అప్‌గ్రేడ్‌ అయితే కార్యకర్త గౌరవ వేతనం రూ.11,500 పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో 45 మినీ అంగన్‌వాడీ కేంద్రాల పేర్లు అర్హత ఉండీ కూడా అప్‌ గ్రేడ్‌ జాబితాలో లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టాం

జిల్లాలో అప్‌గ్రేడ్‌ అయిన మినీ అంగన్‌వాడీ కార్యకర్తల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టాం. మినీ అంగన్‌ వాడీ కేంద్రాల అప్‌ గ్రేడ్‌ జాబితా సంబంధిత ఉన్నతాధికారుల నుంచి మాకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అప్‌గ్రేడ్‌ ప్రక్రియలో కొన్ని లోపాలు జరిగినట్లు గుర్తించాం. తప్పులను సరి చేయడానికి చర్యలు తీసుకున్నాం. అర్హత ఉన్న ప్రతి మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రధాన అంగన్‌వాడీ కేంద్రంగా మార్చడానికి చర్యలు తీసుకుంటాం. – ప్రమీల, పీడీ, ఐసీడీఎస్‌

అంగన్‌వాడీ కేంద్రాల

స్థాయి పెంపులో ఇష్టారాజ్యం

అర్హత ఉన్నా.. 45 కేంద్రాలకు

మొండిచేయి

అప్‌గ్రేడ్‌ .. అస్తవ్యస్తం 1
1/2

అప్‌గ్రేడ్‌ .. అస్తవ్యస్తం

అప్‌గ్రేడ్‌ .. అస్తవ్యస్తం 2
2/2

అప్‌గ్రేడ్‌ .. అస్తవ్యస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement