నాలుగు నెలల నుంచి వరుస తుపాన్ల వల్ల మగ్గం నేయడం కష్టంగా మారింది. మగ్గం గుంతలో నీరు ఊరుతోంది. ఎన్నిసార్లు తోడి పోస్తున్నా ఫలితం ఉండటం లేదు. అలాగే మగ్గం నేయాలని చూస్తే కాలికి పుండ్లు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
– బండారు శ్రీరాములు,
చేనేత కార్మికుడు, ధర్మవరం
జీఓ నంబర్ 5ను అమలు చేయాలి
అకాల వర్షాలతో చేనేత కార్మికులు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కూటమి ప్రభుత్వం జీఓ నంబర్ 5ను అమలు చేసి మగ్గం నీటి ఊటతో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు నిత్యావసరాలతో పాటు ఆర్థిక సాయం అందించాలి. అలానే భారీ వర్షాలతో నీట మునిగిన చేనేత మగ్గాల కార్మికులకు సత్వర సాయం అందించాలి.
– బైముతక రమణ, చేనేత సంఘం
నాయకుడు, ధర్మవరం
ప్రతిపాదనలు పంపించాం
అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న చేనేత కార్మికుల వివరాలు ఆగస్టునెలలోనే ప్రభుత్వానికి పంపించాం. అక్కడి నుంచి అధికారిక ఉత్తర్వులు రాగానే సాయం అందించేందుకు చర్యలు చేపడతాం.
–రామకృష్ణ, ఏడీ, చేనేత, జౌళి శాఖ
ఇబ్బందులు పడుతున్నాం


